Elephant Video: బురద గుంటలో ఇరుక్కున్న ఏనుగు.. ఎంత పోరాడినా బయటకు రాలేక నరకం.. చివరకు..!
ABN , First Publish Date - 2023-09-21T18:00:30+05:30 IST
బురద గుంటలో ఇరుక్కున్న ఓ ఏనుగును కొందరు రక్షించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మనిషి గొప్పదనం ఇదే అంటూ ఈ వీడియో చూసిన వారందరూ కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనిషికి జంతువుకు మధ్య బోలెడు తేడాలు.. అందులో ముఖ్యమైనది స్పందించే హృదయం. ఇది నిజమని నిరూపించే వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియో పాతదే అయినా మరోసారి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది(viral Video). మనిషై పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేస్తోందీ వీడియో. బురద గుంటలో చిక్కుకున్న ఓ గున్న ఏనుగు కొందరు కాపాడిన తీరు నెటిజన్లు అమితంగా ఆకట్టుకుంటోంది.
కెన్యాలో(Kenya) జరిగిందీ ఘటన. ఓ గున్న ఏనుగు పాపం తెలియక బురదలో చిక్కుకుపోయింది. ఎంత పోరాడినా ఫలితం లేకపోగా బురదో మరింతగా దిగిపోయింది. చివరకు పరిస్థితి ఎంతలా దిగజారిందంటే ఏనుగు కాలుకూడా కదపలేని పరిస్థితి. అప్పటికే రెండు రోజుల పాటు కడుపుకు తిండి లేకపోవడంతో బాగా నీరసించిపోయింది. దాన్ని బయటకు లాగడం కష్టమనుకున్నాయో ఏమె కానీ పెద్ద ఏనుగుల మంద కనుచూపు మేరలో కానరాలేదు. రెండు రోజుల పాటు బురదలో చిక్కుకుపోయినా ఏ క్రూర మృగం కంటా అది పడలేదంటే నిజంగా అదృష్టమనే చెప్పుకోవాలి. మరో రెండు రోజులు ఆగుండే ఏ సింహమో లేదా వేట కుక్కలు హైయినాల్లాంటి జంతువుల బారిన పడి నరకం అనుభవిస్తూ కన్నుమూసి ఉండేది.
కానీ, గున్న ఏనుగు అదృష్టం బాగుండడంతో అది కొందరు అటవీ శాఖ సిబ్బంది కంట పడింది. వారు వెంటనే రంగంలోకి దిగారు. బురదలో చిక్కుకుపోయిన ఏనుగు కిందనుంచి తాళ్లు చొప్పించి వాటిని కార్లకు ఇతర భారీ వాహనాలకు కట్టారు. ఆ తరువాత ఏనుగును వాహనాల సాయంతో చాలా కష్టపడి బురదలోంచి బయటకు లాగారు(Elephant struck in mud saved by people). ఇదంతా నెట్టింట్లో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏనుగు ప్రాణం నిలిపినందుకు మనసున్న మారాజులందరికీ సెల్యూట్ చేస్తున్నారు. అద్భుతమైన ఈ వీడియోను మీరూ ఓ మారు చూడండి.