Tea: హైవే పక్కన టీ ఉచితంగా అందించండి.. కారణమిదే?
ABN , Publish Date - Dec 22 , 2023 | 09:07 AM
దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల(Road Accidents) సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల్లో కుటుంబ పెద్దలను కోల్పోతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. హెవీ ట్రక్కులు, లారీలతో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.
భువనేశ్వర్: దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల(Road Accidents) సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల్లో కుటుంబ పెద్దలను కోల్పోతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. హెవీ ట్రక్కులు, లారీలతో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. తెల్లవారుజామున యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ వాహనాల ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిశా ప్రభుత్వం వినూత్న ఐడియాతో ముందుకు వచ్చింది. హైవేపై వెళ్తున్న ట్రక్కులు, లారీ డ్రైవర్లకు రోడ్డు పక్కన ఉన్న ధాబాలు, హోటళ్లలో రాత్రి, తెల్లవారుజామున ఉచితంగా టీ ఇవ్వాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ ధాబా యజమానులను కోరింది. ఉదయం పూట ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాటిని తగ్గించడానికి ఈ ఐడియాతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సమయంతో పని లేకుండా లారీ డ్రైవర్లు రేయింబవళ్లు వాహనాలను నడుపుతూనే ఉంటారు.
కొన్ని సార్లు నిర్విరామంగా కంటికి నిద్ర ఉండదు. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. రవాణా శాఖ మంత్రి టుకుని సాహు మాట్లాడుతూ.. ఆయా హోటళ్లు, ధాబాలు డ్రైవర్లపై చేసిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో ఒడిశాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 25,934 మంది మరణించారని మంత్రి నవంబర్ 23న తెలిపారు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"