Athiya Shetty-KL Rahul: అతియా శెట్టి, రాహుల్ జంటకు ఖరీదైన కానుకలు.. లగ్జరీ కారు, రూ.50కోట్ల అపార్ట్‌మెంట్..

ABN , First Publish Date - 2023-01-25T19:00:10+05:30 IST

సునీల్ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). ‘హీరో’ సినిమాతో వెండితెర పైకి అతియా రంగప్రవేశం చేసింది.

Athiya Shetty-KL Rahul: అతియా శెట్టి, రాహుల్ జంటకు ఖరీదైన కానుకలు.. లగ్జరీ కారు, రూ.50కోట్ల అపార్ట్‌మెంట్..

సునీల్ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). ‘హీరో’ సినిమాతో వెండితెర పైకి అతియా రంగప్రవేశం చేసింది. టీమిండియా క్రికెటర్ కేఎల్. రాహుల్ (KL Rahul) ను అతియా తాజాగా పెళ్లి చేసుకుంది. ఈ వివాహం జనవరి 23న అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా ఈ జంటకు సెలబ్రిటీలు ఖరీదైన బహుమతులు అందించినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

కేఎల్. రాహుల్, అతియా శెట్టికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆడి కారును బహుమతిగా ఇచ్చాడట. ఈ కారు విలువ రూ.1.64కోట్లు అని సమచారం. మామయ్యగా ప్రమోషన్ పొందిన సునీల్ శెట్టి (Suniel Shetty) రూ.50కోట్ల విలువ చేసే విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుస్తోంది. సునీల్ శెట్టి సన్నిహిత మిత్రుడు జాకీ ష్రాఫ్ (Jackie Shroff) రూ.30లక్షల విలువ గల లగ్జరీ బ్రాండ్‌కు చెందిన వాచ్‌ను బహుమతిగా అందించాడట. అతియా సన్నిహిత మిత్రుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) రూ.1.5కోట్ల బ్రాస్‌లేట్‌ను కానుకగా ఇచ్చాడని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. నూతన దంపతులకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రూ.2.17కోట్ల బీఎమ్‌డబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) రూ.80లక్షల విలువ చేసే కవాసాకీ నింజా బైక్‌ను కానుకగా అందించాడని వదంతులు షికార్లు కొడుతున్నాయి. పెళ్లి ముగిసిన తర్వాత సునీల్ శెట్టి మీడియాతో మాట్లాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 ముగిసిన అనంతరం భారీ ఎత్తున రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఈ విందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నాడు.

Updated Date - 2023-01-25T19:13:04+05:30 IST