OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-03-03T09:13:28+05:30 IST

కోవిడ్ కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

కోవిడ్ కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ల జోరు పెరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా మార్చి 1న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

శుభ్ మంగళ్ సావధాన్ (Shubh Mangal Saavdhan)

సిమి ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థాయిలో ఉంటుంది. మేడీ విజయవంతమైన సీరియల్ రచయిత. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. కానీ వారికి పెళ్లి చేసుకోవాలని ఉండదు. ఈ తరుణంలోనే సిమి నానమ్మ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎటువంటి మలుపు తిరిగాయనేది శుభ్ మంగళ్ సావధాన్ చిత్ర కథాంశం. ఈ గుజరాతీ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ షామారో మీ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Shubh.jpg

విక్టోరియా - ఏక్ రహస్య (Victoria - Ek Rahasya)

విక్టోరియా - ఏక్ రహస్య అనేది విరాజాస్ కులకర్ణి, జీత్ అశోక్ ద్వయం దర్శకత్వం వహించిన మరాఠీ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీని ఆనంద్ పండిట్, రూపా పండిట్, పుష్కర్ జోగ్ కలిసి నిర్మించారు. ఈ సినిమాలో పుష్కర్ జోగ్, సోనలీ కులకర్ణి, అక్షయ్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించారు. 13 జనవరి 2023న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Victoria.jpg

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Karate Sheep - ఇంగ్లిష్

Monique Olivier: Accessory to Evil - ఇంగ్లిష్

Sex/Life season 2 - ఇంగ్లిష్

Framed! A Sicilian Murder Mystery Season 2 - ఇటాలియన్

Masameer County Season 2 - అరబిక్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus Hotstar)

True lies - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-03T09:13:28+05:30 IST