Airtel బ్రాడ్‌బాండ్ వినియోగదారులకు శుభవార్త.. రూ.219కే సరికొత్త బ్రాడ్ బాండ్ లైట్

ABN , First Publish Date - 2023-04-28T19:36:52+05:30 IST

ఇది Airtel బ్రాడ్‌బాండ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న చౌకైన Xstream ఫైబర్ ప్లాన్‌. వేగవంతమైన ఇంటర్నెట్, ఇంకా అదనపు సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలతో, బ్రాడ్‌బాండ్ విభాగంలో లో-బడ్జెట్‌లో వినియోగదారులకు ఈ ప్లాన్ గొప్ప ఎంపిక..

Airtel బ్రాడ్‌బాండ్ వినియోగదారులకు శుభవార్త.. రూ.219కే సరికొత్త బ్రాడ్ బాండ్ లైట్

ఎయిర్‌టెల్ అతి తక్కువ ధరకే ఫైబర్ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌(Fiber broadband)ను తీసుకొచ్చింది. కేవలం రూ.219 ధరకే కొత్త ప్లాన్‌ను ఎక్స్‌స్ట్రూమ్ ఫైబర్ బ్రాడ్ బాండ్ లైట్ ప్లాన్(Xstream Fiber Broadband Lite Plan) పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఇది Airtel బ్రాడ్‌బాండ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న చౌకైన Xstream ఫైబర్ ప్లాన్‌. వేగవంతమైన ఇంటర్నెట్, ఇంకా అదనపు సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలతో, బ్రాడ్‌బాండ్ విభాగంలో లో-బడ్జెట్‌లో వినియోగదారులకు ఈ ప్లాన్ గొప్ప ఎంపిక అవుతుంది.

Airtel కొత్త ఆఫర్ ఎక్స్‌స్ట్రూమ్ ఫైబర్ బ్రాడ్‌బాండ్ లైట్ ప్లాన్ ప్రయోజనాలు:

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బాండ్ లైట్ ప్లాన్ నెలకు ఖర్చు కేవలం రూ.219 మాత్రమే. ఈ కొత్త లైట్ ప్లాన్ వినియోగదారులకు 10Mbps బ్రాడ్‌బాండ్ స్పీడ్‌, ఉచితంగా రూటర్‌‌ను అందించబడుతుంది. దీనికి సంవత్సర చందా ఫ్యాసిలిటీ కూడా ఉంది. వినియోగదారులు రూ.3,101 చెల్లించాల్సి సంవత్సర చందా పొందవచ్చు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలోని వినియోగదారులకు మొదట ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ లైట్‌తో పాటు ఇంకా అనేక రకాల బ్రాడ్‌బాండ్ ప్లాన్స్ ఎయిర్‌టెల్‌లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని ప్రయోజనాలతో ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే, ఇతర Xstream ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల నుంచి ఎంచుకోవచ్చు.

  • ఎయిర్‌టెల్ Xstream ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నుంచి ప్రాథమిక ప్లాన్ ధర నెలకు రూ.499, గరిష్టంగా 40 Mbps స్పీడ్, అన్‌లిమిటెడ్ ఇంటర్‌నెట్, కాల్స్, అపోలో 24/7, FASTag, Wynk మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉంటుంది.

  • స్టాండర్డ్ ప్లాన్‌కు నెలకు రూ.799, 100 Mbps స్పీడ్, Xstream ప్రీమియం ప్యాక్‌కు కలిగివుంటుంది. ఇక ఎయిర్‌టెల్ Xstream ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌కు నెలకు రూ.999. డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్యాక్‌లకు గరిష్టంగా 200 Mbps వేగం, సబ్‌స్క్రిప్షన్‌లు ఉంటాయి.

  • ప్రొఫెషనల్ ప్లాన్ నెలకు రూ.1,498. గరిష్టంగా 300 Mbps స్పీడ్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అత్యంత ఖరీదైన ప్లాన్ ధర నెలకు రూ.3,999. గరిష్టంగా 1Gbps వేగంతో అన్ని బెన్‌ఫిట్స్ కలిగి ఉంటుంది.

Updated Date - 2023-04-28T19:36:52+05:30 IST