Bhumi Pednekar: చిన్న పొరపాటు.. నెటిజన్లు ఆడేసుకుంటున్నారు!

ABN , First Publish Date - 2023-03-04T11:48:38+05:30 IST

సినీ సెలబ్రిటీలు, అభిమాన తారలు ఏదైనా మంచి చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు అభిమానులు. అయితే వారి తీరులో ఏదన్నా తేడాగా అనిపిస్తే.. అదే స్థాయిలో ఆడేసుకుంటారు.

Bhumi Pednekar: చిన్న పొరపాటు.. నెటిజన్లు ఆడేసుకుంటున్నారు!

సినీ సెలబ్రిటీలు, అభిమాన తారలు ఏదైనా మంచి చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు అభిమానులు. అయితే వారి తీరులో ఏదన్నా తేడాగా అనిపిస్తే.. అదే స్థాయిలో ఆడేసుకుంటారు. అందుకే బయట ఈవెంట్‌లకు వెళ్లినప్పుడు సెలబ్రిటీలు ఆచితూచి అడుగులేస్తుంటారు. వారి నుంచి చిన్న పొరపాటు దొర్లినా నెటిజను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తుంటారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో భూమి ఫెడ్నేకర్‌(Bhumi Pednekar)కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. (Netizens trolls on Bhumi Pednekar)

ఈవెంట్‌ వేదిక దగ్గర తన అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకొని వివాదంలో చిక్కుకున్నారు. ఆ ఈవెంట్‌లో పూజా కార్యక్రమాల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆ సమయంలో అతిథులంతా వేదికపైకి వెళ్లారు. ఆ పక్కనే ఉన్న భూమి ఫెడ్నేకర్‌ని పిలిచారు నిర్వాహకులు. ఆమె తన చెప్పులు విప్పి వేదికపైకి వెళ్లాలనుకుంది. ఆమె చెప్పులు తీసే ప్రయత్నం చేసినా అవి రాకపోవడంతో.. తన అసిస్టెంట్‌కు సైగ చేయగా అతనొచ్చి సహాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్జేజ్‌కి మీదకెళ్లి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. అసిస్టెంట్‌తో ఆమె చెప్పులు తీయించుకోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఎంత అసిస్టెంట్‌ అయితే మాత్రం చెప్పులు విప్పించుకుంటావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

2.jpg

‘దమ్‌ లాగా కే హైసా’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ, ‘లస్ట్‌ స్టోరీస్‌’(Lust stories), ‘బాలా’, ‘బాదాయి దో’, ‘పతీ పత్ని జౌర్‌ ఓ’ చిత్రాలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీలో మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆమె తెలుగుతెరపై కూడా మెరవబోతుందని టాక్‌ వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న (ఎస్‌ఎస్‌ఎంబీ28 లో ఓ కీలక పాత్రలో భూమి ఫెడ్నేకర్‌ కనిపించనున్నారనే వార్తలు ఫిల్మ్‌ నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Updated Date - 2023-03-04T11:57:36+05:30 IST