Netflix: కొత్త రూల్ దెబ్బకు మారిపోయిన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రయిబర్ల లెక్కలు.. పాస్‌వర్డ్ షేర్ చేయకూడదంటూ తెచ్చిన ఒక్క షరతుతో..!

ABN , First Publish Date - 2023-06-14T17:53:22+05:30 IST

సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు, టీ వీ షోలతో ప్రజలను అమితంగా ఆకర్షించే నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్య కొత్త నిబంధన జారీచేసింది. పాస్ వర్డ్ షేర్ చేయకూడదంటూ తమ సబ్‌స్క్రయిబర్లకు పెట్టిన షరతుతో లెక్కలన్నీ మారిపోయాయి. ఎంతోమంది సబ్‌స్క్రయిబర్లు తమ పాస్ వర్డ్ ను స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు..

Netflix: కొత్త రూల్ దెబ్బకు మారిపోయిన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రయిబర్ల లెక్కలు.. పాస్‌వర్డ్ షేర్ చేయకూడదంటూ తెచ్చిన ఒక్క షరతుతో..!

ప్రస్తుతం ఓటిటి సామ్రాజ్యంలో అత్యంత ఖరీదైన సబ్క్రిప్షన్ ఏదంటే నెట్‌ఫ్లిక్స్ అని టక్కున చెప్పేయచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు, టీ వీ షోలతో ప్రజలను అమితంగా ఆకర్షించే నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్య కొత్త నిబంధన జారీచేసింది. పాస్ వర్డ్ షేర్ చేయకూడదంటూ తమ సబ్‌స్క్రయిబర్లకు పెట్టిన షరతుతో లెక్కలన్నీ మారిపోయాయి. ఎంతోమంది సబ్‌స్క్రయిబర్లు తమ పాస్ వర్డ్ ను స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకునేవారు. దీని వల్ల డబ్బు ఆదా అయ్యేది. కానీ పాస్ వర్డ్ షేర్ చేయకూడదనే షరతు కారణంగా ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. దీనిగురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్(Netflix ) పాస్ వర్డ్ షేరింగ్ గురించి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం తమ సబ్‌స్క్రయిబర్లు ఎవ్వరూ పాస్ వర్డ్ ను ఇతరులకు షేర్ చేయకూడదు(Netflix password sharing crack down). ఇది ప్రస్తుతం యూఎస్(US) లో కొనసాగుతున్న పరిస్థితి. అయితే అక్కడ విధించిన ఈ షరతు ఫలితంగా నెట్‌ఫ్లిక్స్ కు లాభమే చేకూరింది. నెట్‌ఫ్లిక్స్ కొత్త షరతుల ప్రకారం సబ్‌స్క్రయిబర్ ఖాతా(subscriber account), యూజర్ ఐడి(user id), ఐపి అడ్రస్(IP address) మొదలయినవాటిని ట్రాక్ చేస్తామని తెలిపింది. దీని కారణంగా తమ పాస్వర్డ్ ను ఇతరులకు షేర్ చేస్తే ఆ విషయం నెట్‌ఫ్లిక్స్ కు ఇట్టే తెలిసిపోతుంది.

Bathing: రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నా సరే.. అందరూ కామన్‌గా చేసే ఒకే ఒక్క మిస్టేక్ ఇదే.. తప్పు చేస్తున్నామని తెలియకుండానే..!


సబ్‌స్క్రయిబర్లు ఎవరైనా ఇతరులకు పాస్ వర్డ్ షేర్ చేస్తే దానికి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రతి కొత్త కస్టమర్ యూఎస్ లో నెలకు 7.99 డాలర్లు(655.68 Indian rupees), యూకె లో 4.99 యూరోలు(517.88 Indian rupees) చెల్లించాలని చెప్పింది. ఇవన్నీ తమ సబ్‌స్క్రయిబర్లకు ఇ-మెయిల్ ద్వారా తెలిపింది. దీని కారణంగా నెట్‌ఫ్లిక్స్ మే 26,27 తేదీలలో లక్షమంది కస్టమర్లను సంపాదించుకుంది. ఇందులో రోజువారీ సైనప్ లు 73వేలకు పెరిగాయి. ఇది నెట్‌ఫ్లిక్స్ గత 60రోజులకంటే 102శాతం మెరుగ్గా ఉండటం విశేషం. ఈ పాస్ వర్డ్ షేరింగ్ కు పెట్టిన షరతుల ఫలితంగా యూఎస్ కంటే కూడా కెనెడాలో కొత్త సబ్‌స్క్రయిబర్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నట్టు సంస్థ తెలిపింది.

Women's Pants: అమ్మాయిలు ధరించే ప్యాంట్లకు జేబులు పెద్దగా ఎందుకు ఉండవ్.. ఫ్యాషన్ కాదండోయ్.. అసలు కథ వేరే ఉంది..!


Updated Date - 2023-06-14T17:53:22+05:30 IST