RC15: చరణ్ సాంగ్ కోసం ఫారెస్ట్ నుంచి ఫ్లయిట్ లో వచ్చేసారు

ABN , First Publish Date - 2023-02-17T14:01:00+05:30 IST

ఈ సాంగ్ కోసం, దర్శకుడు శంకర్ ఎంత కష్ట పడ్డారో, అలాగే దీని కోసం ఎంతమంది పని చేశారో, ఎలా చేశారో, ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

RC15: చరణ్ సాంగ్ కోసం ఫారెస్ట్ నుంచి ఫ్లయిట్ లో వచ్చేసారు

అగ్ర దర్శకుడు శంకర్ (Shankar Shanumugham) దర్శకత్వంలో అగ్ర నటుల్లో ఒకరు అయిన రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే విశాఖపట్నం లో ఒక సాంగ్ పూర్తి చేసినట్టుగా (#RC15) తెలిసింది. ఈ సాంగ్ కోసం, దర్శకుడు శంకర్ ఎంత కష్ట పడ్డారో, అలాగే దీని కోసం ఎంతమంది పని చేశారో, ఎలా చేశారో, ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ పాట రామ్ సినిమాలో చరణ్ ఎంట్రీ గా ఉంటుందని తెలిసింది. అందుకని అది చాలా భారీగా ఉండాలని ప్లాన్ చేశారట దర్శకుడు శంకర్.

rc15.jpg

భారతదేశం లో వున్న తొమ్మిది ట్రైబ్స్ (Tribes) తెగకు చెందిన డాన్స్ ని చూసి వారిని ఈ సినిమాలో ఈ పాట కోసం ప్రత్యేకంగా చేయించారట శంకర్. దేశం లో ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ట్రైబ్స్ ప్రజలని విమానాల్లో వైజాగ్ తెప్పించాడట శంకర్. నాగాలాండ్, ఒరిస్సా, ఉత్తర్ ప్రదేశ్, అస్సాం అలాగే ఇంకా మరికొన్ని ప్రాంతాల నుండి అక్కడ నివసిస్తున్న ట్రైబ్స్ ప్రజలను విమానాల్లో తీసుకు వచ్చి వాళ్ళచేత ఎలా పాటలు పాడతారు, డాన్స్ ఎలా చేస్తారు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు ఇవన్నీ దగ్గరుండి చూపించమని చెప్పారట. వాళ్ళు చేసే నిజమయిన డాన్స్ చూసి శంకర్ తన సినిమాలో పాట కోసం అలంటి డాన్స్ కావాలని మరీ చేయించాడు దగ్గరుండి అని చెప్తున్నారు.

rc151.jpg

ఆలా తీసుకువచ్చిన ట్రైబ్స్ ప్రజల డాన్స్ చూసి కొరియోగ్రాఫర్ రామ్ చరణ్ పాటకి డాన్స్ కంపోజ్ చేసారని తెలిసింది. ఈ పాట కోసం సుమారు 450 డాన్సర్స్, వెయ్యి (1000) మంది జూనియర్ ఆర్టిస్ట్స్ పని చేశారని తెలిసింది. వీళ్ళందరూ కూడా ఆ పాట లో పాల్గొన్నారట. అయితే వీళ్ళందరికీ ట్రైబ్స్ కాస్ట్యూమ్స్ కుట్టడం ఒక పెద్ద టాస్క్ లా జరిగిందని తెలిసింది. ఎందుకంటే ఒరిజినల్ గా విమానాల్లో తెచ్చిన ట్రైబ్స్ వేసుకున్న కాస్ట్యూమ్స్ చూసి ఈ పాట కోసం అలంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారని తెలిసింది.

ఇన్ని వందలమంది, నిజమయిన ట్రైబ్స్ నుండి స్ఫూర్తి పొందిన డాన్స్, బట్టలు ఇంకా అనేక రకమయిన వాళ్ళ సంప్రదాయాలు కలిపి ఈ పాట లో కనిపిస్తాయని చెపుతున్నారు. ఇది ఇంకా స్క్రీన్ మీద చాలా గ్రాండ్ గా శంకర్ చూపిస్తున్నారని కూడా అంటున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా కోట్లలో ఉంటుంది అని చెపుతున్నారు. ఒక పాట కోసం శంకర్ ఇంత ఖర్చు పెట్టి, ఇంత గ్రాండ్ గా తీస్తున్నారు అంటే, మరి సినిమా ఎంత పెర్ఫెక్షన్ గా ఉంటుందో ఆలోచించండి అని కూడా అంటున్నారు.

rc152.jpg

ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali) ఇద్దరు కథానాయకురాలుగా వేస్తున్నారు. ఇందులో చాలామంది పాన్ ఇండియా నటులు వున్నారు. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమాకి దిల్ రాజు (Dil Raju) నిర్మాత.

Updated Date - 2023-02-17T18:36:33+05:30 IST