Nara Lokesh: చిరు, బాలయ్య సినిమాల‌పై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-11T21:14:29+05:30 IST

సంక్రాంతి బరిలో అనేక సినిమాలు నిలిచిన సంగతి తెలసిందే. ‘తెగింపు’, ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy), ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వారసుడు’ చిత్రాలు పండగ సందర్భంగా విడుదల కానున్నాయి.

Nara Lokesh: చిరు, బాలయ్య సినిమాల‌పై సంచలన వ్యాఖ్యలు

సంక్రాంతి బరిలో అనేక సినిమాలు నిలిచిన సంగతి తెలిసిందే. ‘తెగింపు’, ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy), ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వారసుడు’ చిత్రాలు పండగ సందర్భంగా విడుదల కానున్నాయి. ఇటువంటి తరుణంలో చిరు, బాలయ్య సినిమాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కుల కలహాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నిందన్నారు.

ఫేక్ అకౌంట్స్‌తో అభిమానులను రెచ్చగొట్టే ప్రక్రియకు వైసీపీ సిద్దం అయిందని తెలిపారు. హీరోల అభిమానుల పేరుతో కులాలపై విషం చిమ్మే కుట్ర మొదలైందని చెప్పారు. అభిమానులు ఎవరు కూడా ఈ వలలో పడొద్దని కోరారు. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టి సినిమాలను విజయవంతం చేద్దామన్నారు.

Updated Date - 2023-01-11T21:21:05+05:30 IST