Amigos: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

ABN , First Publish Date - 2023-03-04T15:57:12+05:30 IST

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). ‘బింబిసార’ (Bimbisara) బ్లాక్‌బస్టర్ తర్వాత

Amigos: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?
Amigos Movie Still

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). ‘బింబిసార’ (Bimbisara) బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’ (Amigos). రాజేంద్ర రెడ్డి (Rajendra Reddy) ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసినప్పటికీ.. సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. (Amigos OTT Release Details)

Amigos-1.jpg

తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడు, ఎక్కడంటే.. ఏప్రిల్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ఈ మధ్య వరసబెట్టి సినిమాల రైట్స్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్‌లో ‘అమిగోస్’ విడుదల ఏప్రిల్ 1న అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే.. థియేటర్లలో సక్సెస్ కాలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణను పొందుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది.

Amigos-2.jpg

ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా న‌టించిన ‘ధ‌ర్మక్షేత్రం’ (Dharma Kshetram) సినిమాలోని ఎవ‌ర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌‌ను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రీమిక్స్ సంబంధించిన వీడియో సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. కళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్‌ (Ashika Ranganath)లతో ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ (Ghibran) సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. రెండో పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

Updated Date - 2023-03-04T15:57:12+05:30 IST