Mutton, chicken: మటన్‌, చికెన్‌ ప్రియులకు ఓ గుడ్ న్యూస్..

ABN , First Publish Date - 2023-04-22T11:12:45+05:30 IST

మటన్‌, చికెన్‌(Mutton, chicken) విక్రయాలు చేపట్టవచ్చనే బ్యానర్‌ ఆశ్చర్చపరుస్తోంది.

Mutton, chicken: మటన్‌, చికెన్‌ ప్రియులకు ఓ గుడ్ న్యూస్..

పెరంబూర్‌(చెన్నై): కోయంబత్తూర్‌లో వాయిదా పద్ధతిలో మటన్‌, చికెన్‌(Mutton, chicken) విక్రయాలు చేపట్టవచ్చనే బ్యానర్‌ ఆశ్చర్చపరుస్తోంది. సహజంగా టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషిన్‌, ఏసీ తదితరాలు వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో, కోవై కుళియముత్తూర్‌కు చెందిన రియాజ్‌ అహ్మద్‌, తనకు సొంతమైన మాంసం దుకాణంలో విక్రయాలపై సరికొత్త ఆఫర్‌ ప్రకటించారు. రూ.5 వేలకు పైగా చికెన్‌, మటన్‌ కొనుగోలు చేసే వారు మూడు నెలలు, 6, 9, 12 నెలల వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చని ప్రకటించారు. ఈ పద్ధతిలో నగదు అధికంగా ఉన్నా వినియోగదారులు మాత్రం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - 2023-04-22T11:12:45+05:30 IST