Monkey Video: ఈ వ్యక్తి తన మానాన తాను వెళ్తోంటే ఈ కోతి అస్సలు ఊరుకోలేదుగా.. సడన్‌గా దగ్గరికొచ్చి ఊహించని షాకిచ్చింది..!

ABN , First Publish Date - 2023-05-26T18:35:22+05:30 IST

వ్యక్తి నుంచి కళ్లద్దాలు లాగేసుకుందో కోతి. కానీ, ఓ మహిళ చిన్న ట్రిక్ ప్లే చేసి కోతి నుంచి మళ్లీ కళ్లద్దాలను వెనక్కు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Monkey Video: ఈ వ్యక్తి తన మానాన తాను వెళ్తోంటే ఈ కోతి అస్సలు ఊరుకోలేదుగా.. సడన్‌గా దగ్గరికొచ్చి ఊహించని షాకిచ్చింది..!

ఇంటర్నెట్ డెస్క్: కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు! ఆ అల్లరితో వచ్చే ఇబ్బందులు ఏమిటో కోతుల పాలపడితే గానీ తెలీదు. ఇటీవల ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. తనమానాన తాను వెళుతున్న అతడిని ఓ కోతి టార్గెట్ చేసింది. మెట్లెక్కుతూ వస్తున్న అతడు తన దగ్గరకు రాగానే ఆ కోతి అతడి కళ్లద్దాలను లాగేసుకుంది(Monkey snatch glasses). ఆ తరువాత మనిషి లాగే కళ్లద్దాలను పెట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే, కోతి సడెన్‌గా కళ్లద్దాలు లాగేసుకోవడంతో ఆ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. కోతి నుంచి వాటిని ఎలా వెనక్కు తెచ్చుకోవాలో తెలీక హైరానా పడ్డాడు.

వ్యక్తి ఇబ్బందిని గమనించిన ఓ మహిళ వెంటనే రంగంలోకి దిగింది. ముందుగా కోతికి ఓ ఆహారం ప్యాకెట్ ఇచ్చింది. ఓచేతితో దాన్ని తీసుకున్న కోతి తన రెండో చేతిలో ఉన్న కళ్లద్దాలను మాత్రం వదిలిపెట్టలేదు. దీంతో, ఆ మహిళ మరో ప్యాకెట్ కోతికి ఇచ్చింది. దీంతో, దాని తీసుకునేందుకు అది కళ్లద్దాలను కింద పెట్టగానే మహిళ వేగంగా స్పందించి కళ్లద్దాలను లాగేసుకుంది(Woman tricks monkey for glasses). అక్కడున్న వారు ఇదంతా చూసి పెద్దపెట్టున్న నవ్వారు.

వారం క్రితం నెట్టింట్లో కాలు పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ దీనికి 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే రేంజ్‌లో కామెంట్స్ కూడా వచ్చిపడుతున్నాయి. తమకూ గతంలో ఇలాంటి అనుభవం ఎదురైందని కొందరు చెప్పారు. కోతి నుంచి కళ్లద్దాలు రాబట్టిన మహిళపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఈమె చాలా స్మార్ట్’’ అని కొందరు అంటే ‘‘పిల్లలతో ఎలా డీల్ చేయాలో ఆమెకు బాగా తెలుసనుకుంటా! అందుకే..కోతిని బాగా హ్యాండిల్ చేసింది’’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ‘‘ఈ చేత్తో ఇవ్వడం ఆ చేత్తో పుచ్చుకోవడం.. బిజినెస్ డీల్ అంటే ఇదే’’ అని మరికొందరు సరదా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-26T18:40:05+05:30 IST