‘హమ్మయ్య.. ఆరుగురు కొడుకుల తర్వాత మొత్తానికి ఓ ఆడపిల్ల పుట్టింది.. అసలు నాకు అమ్మాయే పుట్టదనుకున్నా..’

ABN , First Publish Date - 2023-03-17T19:55:26+05:30 IST

ఆరుగురు మగల పిల్లల తరువాత పుట్టిన ఆడపిల్ల.. దంపతుల్లో హర్షాతిరేకాలు..

‘హమ్మయ్య.. ఆరుగురు కొడుకుల తర్వాత మొత్తానికి ఓ ఆడపిల్ల పుట్టింది.. అసలు నాకు అమ్మాయే పుట్టదనుకున్నా..’

ఇంటర్నెట్ డెస్క్: వారిది చూడచక్కని కుటుంబం. ఆ దంపతులకు గంపెడంత సంతానం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు మగపిల్లలు. ఇంట్లో పిల్లల సందడి, అల్లరి చూసి ఆ జంట మురిసిపోని రోజంటూ లేదు. కానీ..తమకు ఒక్క ఆడపిల్ల పుట్టలేదన్న వెలితి వారి మనసులో ఉండిపోయింది. ఆడపిల్లలేని లోటు ఎప్పటికైనా తీరుతుందా అని అనుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి టైంలో వారికి ఓ ఆడపిల్ల పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం యావత్ ప్రపంచాన్నీ ఆకర్షిస్తోంది((Mon of 6 boys gives birth to baby girl).

శారా మాలిటర్, టిమ్ దంపతులకు తమ పిల్లల్ని చూస్తేనే కడుపునిండిపోతుంది. కానీ.. ఆడపిల్లలు లేరన్న వెలితి వారిని కాస్తంత ఇబ్బంది పెడుతుండేది. అలాంటి టైంలో మరో బిడ్డను కని ప్రొడక్షన్ ముగించేద్దామనుకున్నారు. ఇక తాను గర్భవతి అని తెలిసిన నాటి నుంచీ శారాలో టెన్షన్ మొదలైంది. పుట్టబోయేది ఆడబిడ్డా మొగబిడ్డా అనుకుంటూ రోజూ ఆందోళన చెందేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె వైద్య పరీక్షలు చేయించుకోగా పుట్టబోయేది ఆడపిల్లే అని తెలియడంతో ఆమె సంబరానికి అంతేలేకుండా పోయింది. ఈ విషయాన్ని ఆమె నెట్టింట్లో షేర్ చేసింది. ‘‘హమయ్యా ఆరుగురు కొడుకుల తరువాత ఓ ఆడపిల్ల పుట్టబోతోంది. అసలు నాకు అమ్మాయే పుట్టదనుకున్నా..’’ అంటూ తెగ సంబరపడిపోయింది. ఆమె సంతోషం చూసిన నెటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక అక్కడి నుంచీ ఆ కుటంబంలో ఆతృత మరింత పెరిగిపోయింది.

2.jpg

మరోవైపు.. ప్రపంచంలో అనేక మంది ఆ దంపతులను సోషల్ మీడియాలో ఫాలో కావడం ప్రారంభించారు. గుడ్ న్యూస్ కోసం ఓపిగ్గా ఎదురుచూడసాగారు. ఈ క్రమంలో మార్చి 9న శారా ప్రసవించింది. పడండి ఆడశిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ తాలూకు ఫొటోను నెట్టింట్లో షేర్ చేసి శారా.. ఇన్నాళ్లకు తన కోరిక తీరిందంటూ తన ఫాలోవర్లతో తన సంతోషాన్ని పంచుకుంది. ఇక నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలంటూ ఆశీర్వదించారు.

Updated Date - 2023-03-17T19:55:26+05:30 IST