పొగమంచుతో నీళ్లు

ABN , First Publish Date - 2023-04-23T09:13:43+05:30 IST

భూమ్మీద అత్యంత వర్షాభావ రాజధాని నగరాల్లో లిమాది రెండో స్థానం. ఈ పెరూ రాజధాని నగరంలో ఏడాదికి 1.5 సెంటీమీటర్ల వర్షం పడితే ఎక్కువ. అయితే అమెజాన్‌ నుంచి ఈ నగరానికి కాలువలు లేకపోలేదు....

పొగమంచుతో నీళ్లు

భూమ్మీద అత్యంత వర్షాభావ రాజధాని నగరాల్లో లిమాది రెండో స్థానం. ఈ పెరూ రాజధాని నగరంలో ఏడాదికి 1.5 సెంటీమీటర్ల వర్షం పడితే ఎక్కువ. అయితే అమెజాన్‌ నుంచి ఈ నగరానికి కాలువలు లేకపోలేదు. కానీ లిమా చుట్టుపక్కల ప్రాంతాల్లో కటిక నీటి ఎద్దడి. అక్కడి ప్రజల వినూత్న ఆలోచన వాళ్లకి సహాయపడుతోంది. ఎత్తైన ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ జాలీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి పొగమంచును ఒడిసి పట్టుకుని నీటిని అందిస్తున్నాయి. పసిఫిక్‌ మహా సముద్ర గాలులే దీనికి ఆధారం. అటు ఆండెస్‌ పర్వత గాలులూ కలిసి ఎనిమిది నెలల పాటు చిక్కని పొగమంచు ఏర్పడుతుందట. ఒక్కో ప్యానెల్‌ రోజుకు 150 నుంచి 750 లీటర్ల నీటిని అందిస్తుందట. వీలు, వసతిని బట్టి రెండు నుంచి వంద ప్యానల్స్‌ అమర్చుకుంటున్న గ్రామాలు కూడా ఉన్నాయి. కెనడాకు చెందిన ‘ఫాగ్‌క్వెస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్యానల్స్‌ను ఉచితంగా అందిస్తోంది. తాజాగా ఆఫ్రికా దేశాలు కూడా ఫాగ్‌ కలెక్టర్స్‌ ను ఏర్పాటుచేసుకోవడం విశేషం.

Updated Date - 2023-04-23T09:52:10+05:30 IST