మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే దాని అర్థం ఏమిటో ఇలా తెలుసుకోండి!

ABN , First Publish Date - 2023-01-25T08:40:51+05:30 IST

మానసిక సమస్య ఉంటే మనిషిలో దానికి సంబంధించిన అనేక సంకేతాలను కనిపిస్తాయి. మానసికంగా అలసిపోయిన వ్యక్తి, ఈ లక్షణాలతో సతమతమవుతుంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే దాని అర్థం ఏమిటో ఇలా తెలుసుకోండి!

మానసిక సమస్య ఉంటే మనిషిలో దానికి సంబంధించిన అనేక సంకేతాలను కనిపిస్తాయి. మానసికంగా అలసిపోయిన వ్యక్తి, ఈ లక్షణాలతో సతమతమవుతుంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి మానసికంగా అలసిపోయాడనే విషయాన్ని శరీరం ఎలాంటి సంకేతాల ద్వారా తెలియజేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి రోజంతా విచారంగా ఉన్నప్పుడు లేదా అతని మనసు పనిలో నిమగ్నమై కాలేనపుడు, అతను మానసికంగా అలసిపోతున్నాడని అర్థం.

ఇలాంటి పరిస్థితుల్లో ధ్యానం చేయడం, కాస్త విరామం తీసుకోవడం ద్వారా మానసిక అలసటను అధిగమించవచ్చు. ఒక వ్యక్తి అన్ని సమయాలలో ఆందోళన చెందుతూ, లేదా డిప్రెషన్ వంటి సమస్యతో బాధపడుతుంటే అది మానసిక అలసట లక్షణాలలో ఒకటి. అటువంటి పరిస్థితిలో కొంచెం విరామం తీసుకోండి, మీ దృష్టిని వేరొకదానిపై కేంద్రీకరించండి. ఆందోళన నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఒక వ్యక్తి ఒంటరిని అనుకున్నప్పుడు, గుంపు మధ్య కూడా ఒంటరితనం అనుభవిస్తాడు.

అది కూడా మానసిక అలసట లక్షణాలలో ఒకటి. అటువంటి పరిస్థితిలో కుటుంబం, స్నేహితులతో కొంత సమయం గడపండి. మీ సమస్యలను వారితో పంచుకోండి. ఒక వ్యక్తికి ఏకాగ్రత లోపించినప్పుడు అంటే ఏ పని మీదా దృష్టి పెట్టలేనప్పుడు, చిన్న చిన్న విషయాలను మరచిపోతే అది మానసిక అలసట లక్షణాలలో ఒకటని గ్రహించాలి. అటువంటి పరిస్థితిలో బాధితుడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం అవసరం. చిరాకు, కోపం మొదలైనవి, మానసిక అలసట లక్షణాలలో చేరి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడమే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2023-01-25T08:40:53+05:30 IST