OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-03-07T09:19:23+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. మార్చి 6న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

మందాకిని (Mandakini)

చండీపురం గ్రామానికి చెందిన మందాకిని అనే యువతి పలు కారణాల వల్ల మానసికంగా బలహీనంగా ఉంటుంది. ఈ తరుణంలో ఆమెకి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. దీంతో వాటికి కారణాలు వెతుక్కుంటూ వెళ్లిన ఆ యువతికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ ప్రయాణంలో ఆమెకి ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొందనేది ఈ ‘మందాకిని’ కథాంశం. హిమ బిందు, ప్రియ హేగ్డే, ఆర్‌కే చంద్రన్, వర్ష అజయ్, జయలలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

mandikini.jpg

ఫెడెరికో చీసా - బ్యాక్ ఆన్ ట్రాక్ (Federico Chiesa - Back on Track)

రోమ్‌లోని స్టేడియం ఒలింపికో పుట్‌బాల్ గేమ్ 9 జనవరి 2022న జరిగింది. ఆట ప్రారంభమైన 30 నిమిషాలకు, ఫెడెరికో చీసా నొప్పితో అరుస్తూ నేలపై కుప్పకూలిపోయాడు. అతను తన ఎడమ మోకాలి క్రూసియేట్ లిగమెంట్‌ నలిగిపోయింది. పది నెలల తర్వాత పుట్‌బాల్ ఆటగాడిగా ఎలా పునరావృతం చేశాడు. దానికి అతనికి సపోర్టుగా నిలిచిన వ్యక్తుల గురించి డాక్యుమెంటరీ చిత్రం ‘ఫెడెరికో చీసా - బ్యాక్ ఆన్ ట్రాక్’ వివరిస్తుంది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

fedirico.jpg

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Chris Rock: Selective Outrage - ఇంగ్లిష్

Ridley Jones Season 5 - ఇంగ్లిష్, స్పానిష్

Unlock the Boss - కొరియన్

ప్రైమ్ వీడియో (Prime Video)

Kharaab Neeyat - హర్యాన్వీ

ఇవి కూడా చదవండి:

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-07T09:19:23+05:30 IST