మాట్రిమోనియల్ సైట్‌లో చెల్లెలి ప్రొఫైల్... తండ్రి చేసిన పనితో విభేదించిన యువకుడు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-19T19:40:38+05:30 IST

మాట్రిమోనియల్ సైట్‌లో చెల్లెలి ప్రొఫైల్.. తండ్రి చేసిన పనికి యువకుడికి గుస్సా..

మాట్రిమోనియల్ సైట్‌లో చెల్లెలి ప్రొఫైల్... తండ్రి చేసిన పనితో విభేదించిన యువకుడు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి సంబంధాలు కుదరాలంటే ఎన్నో అంశాలు కలిసిరావాలి. యువతీ యువకులు ఒకరికొకరు నచ్చాలి. జీతనాతాలు, ఆస్తిపాస్తులు, అందచందాలు..ఇలా అనేక అంశాల్లో ఒకరికొకరు నచ్చితే కానీ సంబంధాలు కుదరవు! అయితే.. తన సోదరికి పెళ్లి సంబంధం చూసే క్రమంలో తండ్రి చేసిన పని ఓ యువకుడిని నచ్చలేదు. ఆయన చేసిన పని చాలా సిల్లీగా అనిపించింది. దీంతో.. అతడు తన మనోభావాల్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.

మ్యాట్రిమోనియల్ సైట్‌లో తండ్రి తన సోదరి పొడవు ఒకటి రెండు అంగుళాలు ఎక్కువగా పేర్కొన్నారని అతడు చెప్పాడు. ఆ చర్య తనకు సుతరామూ నచ్చలేదని తేల్చి చెప్పాడు. ‘‘నా జీవితంలో చూసిన సిల్లీ ఉదంతం ఇదే. మా సిస్టర్ సంపాదన సగటు భారతీయ యువకుడి సంపాదన కంటే చాలా ఎక్కువ. ఆమె మాస్టర్స్ డిగ్రీ కూడా చేసింది. త్వరలో జర్మనీ కూడా వెళ్లబోతోంది. అయినా కానీ మా నాన్న ఇలా చేయడం నాకు సిల్లీగా అనిపించింది’’ అంటూ అతడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో..నెట్టింట్లో పెద్ద చర్చ మొదలైంది.

‘‘నాకు తెలిసి ఆమెకు కాబోయే వాడు పొడవు విషయంలో మరీ పట్టింపులకు వెళ్లకపోవచ్చు. మీ నాన్న బాగా టెన్షన్ పడుతున్నారని నాకు అనిపిస్తోంది’’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం అతడికి కాస్త ఘాటుగా బదులిచ్చారు. ‘‘మీ సిస్టర్ జర్మనీకి వెళ్లబోతున్నంత మాత్రాన.. సగటు మగాడు అంటూ భారతీయ యువకుల్ని తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు బాస్’’ అంటూ కొందరు నెటిజన్లు సీరియస్ అయ్యారు.

Updated Date - 2023-03-19T19:48:40+05:30 IST