Viral Video: రెండు చేతులూ లేవు.. స్టీరింగ్‌ను కూడా పట్టుకోకుండానే కారును ఈ వ్యక్తి ఎలా నడిపాడో చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-04-03T19:43:13+05:30 IST

రెండు చేతులూ లేకపోయినా కారును సునాయశంగా నడిపిన వ్యక్తి..వీడియో వైరల్..

Viral Video: రెండు చేతులూ లేవు.. స్టీరింగ్‌ను కూడా పట్టుకోకుండానే కారును ఈ వ్యక్తి ఎలా నడిపాడో చూస్తే అవాక్కవడం ఖాయం..!

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో డ్రైవింగ్ కూడా ఓ అత్యవసరమైన నైపుణ్యంగా మారిపోయింది. ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోతే మనల్ని ఆదుకునేది మన డ్రైవింగ్ నైపుణ్యాలే. అయితే.. నగర ట్రాఫిక్‌లో అలసట లేకుండా ప్రయాణించాలంటే కారుకు మించిన ఆప్షన్ లేదు. అయితే.. కారు నడపాలంటే మన చేతులూ కాళ్లు సవ్యంగా ఉండాలి. లేకపోతే స్టీరింగ్ తిప్పడం, గేర్లు మారుస్తూ డ్రైవింగ్ చేయడం అస్సలు సాధ్యం కాదు. కానీ.. రెండు చేతులూ భుజాల దాకా(Man Without hands) లేకపోయినా కూడా ఓ వ్యక్తి సునాయసంగా భారీ కారును(Car Driving) నడిపేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.

హ్యూమన్స్ ఆఫ్ మెటల్ పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో తొలిసారిగా కనిపించింది. ఈ వీడియో ఎక్కడ తీశారో క్లారిటీ లేకపోయినప్పటికీ ఆ దివ్యాంగుడి నైపుణ్యానికి మాత్రం జనాలు ఫిదా అవుతున్నారు.

ఇక దివ్యాంగుడు నడిపేందుకు వీలుగా ఆ కారులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. కారు దిశన కాలి వద్ద ఉన్న స్టీరింగ్ వీల్‌తో తిప్పగలిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. గేర్లు మార్చాలంటూ మాత్రం దివ్యాంగుడు కాస్తంత శ్రమపడాల్సి వచ్చింది. గేర్ మార్చాల్సిన ప్రతిసారీ అతడు ముందుకు వంగి నోటితో గేర్ రాడ్ ‌ను పట్టుకుని కదపాల్సి వచ్చింది. ఈ పని కూడా అతడు ఎంతో సునాయసంగా చేస్తున్నట్టు కనిపించడంతో నెటిజన్ల నుంచీ ఈ వీడియోకు భలేగా రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటివరకూ ఈ వీడియోను సుమారు 2 లక్షల మంది చూశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో ఎంతగా పాప్యులర్ అవుతోందో. చేతులు లేకపోయినా కారు నడిపేందుకు ప్రయత్నించిన ఆ దివ్యాంగుడిని పొగుడుతున్న నెటిజన్లు ఇలాంటి ఎవరూ చేయకూడదని కూడా హెచ్చరిస్తున్నారు. మోటార్ వాహనాల నిబంధనలకు ఇది విరుద్ధమే కాకుండా ఇతరులను ప్రమాదంలో పడేస్తుందని కూడా హెచ్చరిస్తు్న్నారు.

Updated Date - 2023-04-03T19:43:13+05:30 IST