పిల్లలు కలగడం లేదని మహిళ ఆవేదన.. ఆమెలో కొత్త ఆశలు రేపి మూడు ప్రాంతాల్లో తిప్పి చివరకు..

ABN , First Publish Date - 2023-03-19T17:37:58+05:30 IST

పిల్లలు లేరన్న ఆవేదనలో కూరుకుపోయిన వివాహితకు ఆశలు కల్పించి దారుణానికి ఒడిగట్టాడో తాంత్రికుడు.

పిల్లలు కలగడం లేదని మహిళ ఆవేదన.. ఆమెలో కొత్త ఆశలు రేపి మూడు ప్రాంతాల్లో తిప్పి చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలు లేరన్న ఆవేదనలో కూరుకుపోయిన వివాహితకు ఆశలు కల్పించి దారుణానికి ఒడిగట్టాడో తాంత్రికుడు. తాను చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారని నమ్మించి చివరకు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాస్స్‌వాడకు చెందిన ముఖేశ్ గార్సీయా తాను తాంత్రికుడినని చెప్పుకుని తిరుగుతుంటాడు.

ఇటీవల అతడికి ఓ వివాహిత పరిచయమైంది. పిల్లలు లేని కారణంగా ఆవేదనలో కూరుకుపోయిన ఆమె ముఖేశ్‌ను సంప్రదించింది. దిలావర్ షేఖ్ అనేక మరో నిందితుడు ఆమెను ముఖేశ్ వద్దకు తీసుకెళ్లాడు. తనకు తెలిసిన తాంత్రిక ప్రక్రియతో పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని ముఖేశ్ గతంలో దిలావర్‌కు చెప్పాడు. సిరిసంపదలు కోరుకున్న వారికి కనకవర్షం కురుస్తుందని కూడా చెప్పాడు. దీంతో.. షేక్ అతడి వద్దకు వివాహితను తీసుకెళ్లాడు. తాను చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారంటూ ముఖేశ్ ఆమెలో కొత్త ఆశలు కల్పించాడు.

ఈ క్రమంలో ముఖేశ్ బాధితురాలిని తొలుత ఖేదా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మహీసాగర్‌కు వెళ్లాడు. ఆ తరువాత రాజస్థాన్ బోర్డర్ సమీపంలోని దహోడ్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తన షాపులో తాంత్రిక ప్రక్రియ పేరిట ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గతంలోనూ పలువురు మహిళల బలహీనలతను ఆసరాగా చేసుకుని బలాత్కరించాడని పోలీసులు తెలిపారు. మార్చి 16నే షేఖ్ పోలీసులకు చిక్కగా.. ముఖేశ్‌ను తాజాగా అరెస్టు చేశారు.

Updated Date - 2023-03-19T17:40:32+05:30 IST