ఇంత తింగరి పని చేసినా బతికున్నాడంటే నిజంగా లక్కీ ఫెలోనే.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

ABN , First Publish Date - 2023-03-25T20:57:46+05:30 IST

నెట్టింట వీడియో వైరల్.. షాకైపోతున్న నెటిజన్లు.. వీడు ఎలా బతికున్నాడా అంటూ కామెంట్స్..

ఇంత తింగరి పని చేసినా బతికున్నాడంటే నిజంగా లక్కీ ఫెలోనే.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

ఇంటర్నెట్ డెస్క్: అదేంటోకానీ కొందరు తమకు రూల్స్ ఫాలో అవడం అస్సలు నచ్చదన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిసీ రిస్క్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారు మనకు ఎక్కువగా నాలుగు కూడళ్ల వద్ద ఎదురుపడుతుంటారు. వీళ్లకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఖాతారు చేసే అలవాటు ఉండదు. రెడ్ సిగ్నల్ పడినా కూడా టాప్ గేర్‌లో దూసుకుపోతుంటారు. ఈ క్రమంలో తాము ప్రమాదంలో పడటమే కాకుండా.. ఎదుటివారి జీవితాలతోనూ చెలగాటమాడుతుంటారు. అటువంటి వ్యక్తికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్(Viral Video) అవుతోంది.

ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. ఓ రైల్వే క్రాసింగ్(Railway Crossing) వద్ద రెడ్ సిగ్నల్(Red signal) పడింది. ఈ క్రమంలోనే చిన్న స్కూటీపై ఓ వ్యక్తి వేగంగా పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో రైలు కూడా వేగంగా వస్తుంది. చివరి నిమిషంలో రైలును గుర్తించిన వ్యక్తి బ్రేకులు వేయడంతో రైలు కింద పడకుండా బతికిపోయాడు. మరణం వెంట్రుకవాసిలో తప్పిపోయింది. రైలు వస్తున్నట్టు గుర్తించిన అతడు వెంటనే బ్రేకులు వేయడంతోపాటు స్కూటీని పక్కకు తిప్పుకుని ప్రమాదం నుంచి బయటపడతాడు(Man escapes death).

అయితే ఈ మొత్తం ఉదంతంలో అతడు ఏమాత్రం భయం లేన్నట్టు వ్యవహరించడమే నెటిజన్లను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. ముఖ్యంగా ద్విచక్రవాహనదారుడు చాలా సింపుల్‌గా తన వాహనాన్ని పక్కకు మళ్లించిన తీరు చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యపోతున్నారు. ‘‘మనోడికి ఇదంతా అలవాటైపోయిందేమో..మరణాన్ని అంత దగ్గర నుంచి చూసి కూడా ఏమీ కానట్టు బండి తీసుకుని ముందుకెళ్లిపోయాడు’’ అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో.. ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Updated Date - 2023-03-25T20:58:47+05:30 IST