Viral: బాబోయ్.. రైల్వే స్టేషన్‌లోకి సైకిల్‌తో వచ్చి.. ప్లాట్‌ఫాం మీదకు తెచ్చి..
ABN , First Publish Date - 2023-12-10T21:12:54+05:30 IST
నెట్టింట్లో చేసే స్టంట్ల వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని ఆగ్రహం తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో వైరల్ అవుతూ జనాలను అశ్చర్యపరుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట్లో చేసే స్టంట్ల వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని ఆగ్రహం తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో వైరల్ (Viral video) అవుతూ జనాలను అశ్చర్యపరుస్తోంది. వీడియోలోని వ్యక్తి టాలెంట్ సూపర్ అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ వ్యక్తి సైకిల్ తీసుకుని రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాడు. సైకిల్‌ను ప్లాట్‌ఫాం అంచువరకూ తీసుకెళ్లి అక్కడ దానిపై స్టంట్లు చేయడం ప్రారంభించాడు. తొలుత సైకిల్ టైరును చేతితో తిప్పుతూ ఓ రౌండు తిరిగాడు. ఆ తరువాత సైకిల్ సీటుపై బోర్లా పడుకుని ముందుకు పోనిచ్చాడు (Man performs cycle stunts on railway platform).
ఈ దృశ్యాలను చూసి జనాలు షాకైపోతున్నారు. స్టంట్ బానే ఉన్నప్పటికీ అతడిని ప్లాట్‌ఫాంపైకి సైకిల్‌తో రానిచ్చింది ఎవరని ప్రశ్నించారు. ప్రమాదం జరుగొచ్చన్న స్పృహ స్టంట్ చేసిన వ్యక్తితో పాటూ అతడిని గమనిస్తున్న వారిలోనూ లేకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే, అధిక శాతం మంది మాత్రం మనోడి స్టంట్‌ను మెచ్చుకున్నారు. మట్టిలో మాణిక్యాలు అనేకం సమాజంలో ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేశారు.