Share News

Viral video: కళాకారుడంటే ఇతడే..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకైపోవాల్సిందే..!

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:07 PM

వివిధ డ్యాన్స్ భంగిమల్లో మహిళ చిత్రాలను గీసిన ఓ కుర్రాడు ఓ కళాఖండాన్నే సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral video: కళాకారుడంటే ఇతడే..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకైపోవాల్సిందే..!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక అనేక మందికి తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కింది. ఈ క్రమంలో కొందరి వీడియోలు జనాలకు బాగా నచ్చడంతో అవి వైరల్‌గా మారుతుంటాయి. అలాంటి ఓ వీడియో (Viral Video) ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. మహిళ డ్యాన్స్‌కు సంబంధించి 150 భంగిమల్లో ఉన్న చిత్రాలను గీసిన ఓ యువకుడు వాటితో ఓ అద్భుత దృశ్యం క్రియేట్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న గులాబీ షరారా (Gulabi Sharara) పాటకు ఓ మహిళ డ్యాన్స్ చేసిన వీడియోను ఎంచుకున్నాడు. ఆ తరువాత మహిళ డ్యాన్స్‌ ఫోజులకు సంబంధించి దాదాపు 150 చిత్రాలను గీశాడు (Art work). ఆ తరువాత వాటిన్నిటినీ పుస్తకంలోని పేజీల్లా తిప్పితే కార్టూన్ బొమ్మ డ్యాన్స్ వేసినట్టు కనిపించింది. అసలు వీడియోకు దగ్గరా ఇది ఉండటంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. యువకుడిని తెగ మెచ్చుకుంటున్నారు.

ఈ చిత్రాలన్నిటినీ గీసేందుకు యువకుడికి సుమారు 11 రోజులు పట్టింది. అయితే, అతడి కష్టానికి గొప్ప గుర్తింపు దక్కడంతో వీడియో యమాగా వైరల్ అవుతోంది. డిసెంబర్ 7న వీడియో నెట్టింట కాలుపెట్టగా ఇప్పటివరకూ 36 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యువకుడి టాలెంట్‌కు జనాలు ఫిదా అయిపోవడంతో వీడియో ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Updated Date - Dec 17 , 2023 | 06:10 PM