Viral Video: కళ్లు లేవు కదా.. గుడ్డివాడిని స్టేడియానికి తీసుకొచ్చావేంటని అంతా వింతగా చూశారు.. కానీ ఈ కుర్రాడు చేసింది చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-26T19:26:52+05:30 IST

కళ్లు లేని తన స్నేహితుడిని ఫుడ్ బాల్ మ్యాచ్ కోసం స్టేడియానికి తీసుకొచ్చాడో యువకుడు. మైదానంలో జరుగుతున్నదంతా కళ్లకు కట్టినట్టు వివరించాడా యువకుడు. తన స్నేహితుడి కళ్లతోనే ఆ వ్యక్తి మ్యాచ్‌ను ఆసాంతం ఆస్వాదించాడు.

Viral Video: కళ్లు లేవు కదా.. గుడ్డివాడిని స్టేడియానికి తీసుకొచ్చావేంటని అంతా వింతగా చూశారు.. కానీ ఈ కుర్రాడు చేసింది చూస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: కాసేపట్లో అక్కడ ఓ ఫుట్‌‌బాల్ మ్యాచ్(Football match) ప్రారంభం కాబోతోంది. ఇంతలో స్టేడియంలో(Stadium) ఇద్దరు స్నేహితులు అడుగుపెట్టారు. అందులో ఒకరికి కళ్లు లేవు. ఎదురుగా ఉన్నది అస్సలు కనిపించదు. గుడ్డి వాడిని(Blind man) ఫుట్ బాల్ స్టేడియానికి ఎందుకు తీసుకొచ్చాడో అనుకుంటూ అక్కడి వారు వారిద్దరినీ ఎగాదిగా చూడటం ప్రారంభించారు. మరికొందరు కాస్త చొరవ తీసుకుని ఇదే ప్రశ్న అడిగారు. అయితే, మ్యాచ్ ప్రారంభం కాగానే వారి ప్రశ్నకు సమాధానం దొరికింది.

మ్యాచ్ మొదలు అయ్యాక ఓ యువకుడు అంధుడైన తన స్నేహితుడికి మైదానంలో ఏం జరుగుతోందో వివరించడం ప్రారంభించాడు. క్రీడాకారులు బంతిని ఎటువైపు తన్నారో? గోల్ పడిందా? మిస్ అయ్యిందా? ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? ఇలా ప్రతిచిన్న విషయాన్ని అతడు వివరించాడు. మ్యాచ్‌లో ఉత్కంఠ రేపిన ఘటనలను కూడా వివరించాడు. దీంతో, అంధుడైన ఆ వ్యక్తి తన ఫ్రెండ్ కళ్లతోనే మ్యాచ్ అంతా చూశాడు. అక్కడున్న వారితో కలిసి ఆటను ఆసాంతం ఆశ్వాదించాడు.

సహజంగానే ఈ వీడియో వైరల్‌గా(Viral Video) మారింది. ఆ యువకుల స్నేహం చూసి నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. స్నేహానికి అందచందాలు, ఆస్తిఅంతస్తులు, అంగవైకల్యం అడ్డుకాదని వీరిద్దరూ నిరూపించారంటూ మురిసిపోయారు. ‘‘స్నేహం అంటే ఏంటని ఎవరైనా అడిగితే ఈ వీడియో చూపించండి’’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. నెటిజన్ల మనసుకు హత్తకున్న ఈ వీడియోను కచ్చితంగా చూడాల్సిందే!

Updated Date - 2023-05-26T19:26:55+05:30 IST