ఆ జంటది అన్యోన్య దాంపత్యం.. పెళ్లై ఆరేళ్లు దాటింది.. ఇన్నాళ్ల తరువాత భార్య గురంచి ఓ షాకింగ్ విషయం తెలియడంతో..

ABN , First Publish Date - 2023-03-19T18:16:46+05:30 IST

పెళ్లైన ఆరేళ్ల తరువాత భార్య గురించి అసలు నిజం తెలియడంతో..

ఆ జంటది అన్యోన్య దాంపత్యం.. పెళ్లై ఆరేళ్లు దాటింది.. ఇన్నాళ్ల తరువాత భార్య గురంచి ఓ షాకింగ్ విషయం తెలియడంతో..

ఇంటర్నెట్ డెస్క్: వాళ్లది అన్యోన్యమైన దాంపత్యం. పెళ్లై ఆరేళ్లు దాటింది. సంతానం కూడా ఉన్నారు. అయితే.. ఇటీవల అతడి భార్య ప్రసవ సందర్భంగా తీవ్ర అనారోగ్యం బారిన పడింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్(Kidney transplantation) చేయాల్సి వచ్చింది. అయితే.. బంధువుల్లో ఎవరైనా తమ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొస్తారేమనని ప్రయత్నించగా ఒకరిద్దరూ అంగీకరించారు. ఈ క్రమంలో బంధువులకు పరీక్ష నిర్వహించిన డాక్టర్లు వారి కిడ్నీలు మహిళకు సరిపడవని చెప్పారు. అలాంటి సమయంలో భార్యకు కిడ్నీ దానమిచ్చేందుకు ముందుకొచ్చిన భర్తకు ఊహించిన పరిణామం ఎదురైంది.

తొలుత వైద్యులు అతడికి కొన్ని పరీక్షలు జరిపారు. ఆ తరువాత వైద్యులు భర్తకు అతడి కిడ్నీ భార్యకు సరిపోతుందని చెప్పారు. అంతేకాకుండా.. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని భర్తకు చెప్పారు. ఆ రిపోర్టులు కూడా వచ్చాక మళ్లీ వైద్యులను సంప్రదించిన అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. భార్య, అతడికి మధ్య జన్యుపరంగా చాలా సారూప్యత ఉందని చెప్పారు. వారిద్దరూ వరసకు తోడబుట్టిన వారయ్యే అవకాశం(Wife Husband Genetically related) కూడా కొట్టిపారేయలేమని చెప్పడంతో షాకైపోవడం ఆ భర్త వంతైంది. భార్య తనకు చెల్లెలయ్యే అవకాశం ఉందని తెలిసిన అతడికి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది.

‘‘డాక్టర్లు చెప్పింది విని నేను తొలుత షాకయ్యా. నా భార్య వాస్తవానికి నాకు చెల్లె అయ్యే అవకాశం ఉందని తెలిసి నోరెళ్లబెట్టా. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జన్యుపరంగా 50 శాతం వరకూ ఉండొచ్చని చెప్పారు. తోబుట్టువుల డీఎస్ఏ కూడా గణనీయంగా పోలి ఉంటుందని చెప్పారు. కానీ.. భార్యభర్తల డీఎన్‌ఏలో ఇంత సారూప్యత ఉండటం అసాధారణమని వారు అన్నారు. దీంతో.. నాకేం మాట్లాడాలో అర్థంకాలేదు’’ అంటూ అతడు ప్రముఖ చర్చా వేదిక రెడిట్‌లో(Reddit) తన బాధను పంచుకున్నాడు. తనను చాలా చిన్నప్పుడే మరొకరు దత్తత తీసుకున్నారని, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరూ కూడా తెలీదని చెప్పుకొచ్చాడు. అతడి కథనం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు అతడు చింతించాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చారు. ఇప్పటికే అతడికి పిల్లలు ఉన్నారు కాబట్టి వారి బాగోగుల కోసం గతాన్ని మర్చిపోవాలని సూచించారు.

Updated Date - 2023-03-19T18:18:22+05:30 IST