Maheshbabu: నరాలు కనిపించేలా... ఏం చేశాడంటే!

ABN , First Publish Date - 2023-03-02T13:56:57+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబుకు ఉన్కన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్‌ ప్యాన్‌ ఇండియాకు చేరబోతోంది. తాజాగా ఆయన హీరోగా రెండు చిత్రాలు కమిట్‌ అయ్యారు త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Maheshbabu: నరాలు కనిపించేలా... ఏం చేశాడంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబు (Maheshbabu) ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్‌ ప్యాన్‌ ఇండియాకు చేరబోతోంది. తాజాగా ఆయన హీరోగా రెండు చిత్రాలు కమిట్‌ అయ్యారు త్రివిక్రమ్‌(Trivikram movie)తో చేస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తో ప్యాన్‌ వరల్డ్‌ చిత్రం చేయబోతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’(SSMB28) చిత్రం కోసం ప్రిన్స్‌ కసరత్తులు చేస్తున్నారు. గురువారం ఓ లుక్‌తో ఆయన ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. తన ఫిటినెస్‌ ఫొటో షేర్‌ చేసి అభిమానులకు ట్రీట్‌ ఇచ్చారు. మహేశ్‌బాబు చేసిన చిత్రాలన్ని సిక్స్‌ప్యాక్‌, షర్ట్‌ లేకుండా బాడీ చూపిస్తు చేసిన చిత్రాలేమీ లేవు. తాజాగా ఆయన జిమ్‌లో (gym photos Viral) బైసిప్స్‌ వర్క్‌ అవుట్‌ అనంతరం నరాలు కనిపిస్తున్న ఫొటోను షేర్‌ చేశాడు.' Arm day' అని కాప్షన్ ఇచ్చారు . ఇవి చూసి ఫాన్స్‌ మురిసిపోతున్నారు. మహేశ్‌ బీస్ట్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

త్రివిక్రమ్‌, రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రాల కోసమే మహేశ్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌గా ఉన్న ఆ లుక్‌ చూశాక మహేశ్‌ తన రూల్స్‌ బ్రేక్‌ చేయబోతున్నాడా, తదుపరి చిత్రంలో సిక్స్‌ప్యాక్‌ బాడీతో కనిపించనున్నాడా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.

Updated Date - 2023-03-02T14:46:48+05:30 IST