Dookudu: తెల్లవారు జామున 3 గంటలకి.. అభిమానుల శివతాండవం

ABN , First Publish Date - 2023-02-16T22:03:01+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అభిమానులు సత్తా ఏంటో మరోసారి చూపించారు. రీ రిలీజ్ ట్రెండ్‌కి నాంది పలికిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు

Dookudu: తెల్లవారు జామున 3 గంటలకి.. అభిమానుల శివతాండవం
Mahesh Babu in Dookudu Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అభిమానులు సత్తా ఏంటో మరోసారి చూపించారు. రీ రిలీజ్ ట్రెండ్‌కి నాంది పలికిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు మహాశివరాత్రి (Maha Shivratri) పర్వ దినాన్ని పురస్కరించుకుని తెల్లవారు జామున 3 గంటలకు ‘దూకుడు’ (Dookudu) స్పెషల్ షో ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ సుదర్శన్ 35MM థియేటర్‌లో ఉదయం 3గంటలకు షో అని బుక్ మై షో‌లో అలా అనౌన్స్ చేశారో.. లేదో టికెట్స్ అన్నీ హాట్ కేకులా అమ్ముడైపోవడం విశేషం. మహేష్ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. ఈ బుకింగ్‌తో మరోసారి తెలియజేశారు ఫ్యాన్స్. షో ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే టికెట్స్‌పై వారు శివతాండవం ఆడేశారు. ప్రస్తుతం ‘దూకుడు’ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఎప్పుడో వచ్చిన ‘దూకుడు’ (Dookudu) కోసమే ఇంతగా ఎగబడితే.. నెక్ట్స్ రాబోయే మహేష్ రెండు సినిమాల విషయంలో అభిమానుల అలజడి సునామీని సృష్టించడం ఖాయమని చెప్పుకోవచ్చు.

ఇక దూకుడు విషయానికి వస్తే.. శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ చిత్రంగా నిలిచింది. మహేష్ బాబు ఇందులో చేసిన కామెడీ, యాక్షన్ హైలెట్స్‌గా నిలిచాయి. సమంత (Samantha) హీరోయిన్‌గా నటించింది. పాటలు కూడా మేజర్ హైలెట్స్‌గా నిలిచాయి. ప్రకాశ్ రాజ్ (Prakash Raj), సోనూసూద్ (Sonu Sood) కీలక పాత్రలలో నటించారు. మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ చిత్రం, అలాగే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)తో మరో చిత్రం చేసేందుకు ఆయన కమిట్ అయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తున్న SSMB28 చిత్రం సెట్స్‌పై ఉండగా.. రాజమౌళితో చేయాల్సిన SSMB29 చిత్రానికి సంబంధించి త్వరలోనే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

Updated Date - 2023-02-16T22:03:03+05:30 IST