మహిళ శరీరం నుంచి వేరుపడ్డ నీడ..షాకింగ్ వీడియో.. ఇది అసలు సాధ్యమేనా..

ABN , First Publish Date - 2023-03-25T20:29:17+05:30 IST

మహిళ దేహం నుంచి నీడను వేరు చేసిన ఇంద్రజాలికుడు.. భయభ్రాంతులకు లోనవుతున్న నెటిజన్లు

మహిళ శరీరం నుంచి వేరుపడ్డ నీడ..షాకింగ్ వీడియో.. ఇది అసలు సాధ్యమేనా..

ఇంటర్నెట్ డెస్క్: సైన్స్ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రజలు మంత్రతంత్రాలను, అదృశ్యశక్తులనూ నమ్మేవాళ్లు. అయితే నేటి ఆధునిక సమాజంలో ఇలాంటి నమ్మకాలు దాదాపుగా తొలగిపోయాయనే చెప్పాలి. కానీ.. ఇటీవల వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అదృశ్యశక్తులు ఉన్నాయా? మంత్రతంత్రాలు ఉన్నాయా? అని అనుకుంటూ షాకైపోతున్నారు. వారి కారణానికి లేకపోలేదు. ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. ఓ మహిళ శరీరం నుంచి నీడ వేరయిపోతోంది(shawdow seperated from woman). సినిమాల్లో గ్రాఫిక్స్‌లాగా..క్షణకాలం పాటూ శరీరం నుంచి వేరుపడ్డ నీడ మళ్లీ యథాతథ స్థానానికి చేరుకుంటుంది.

ఓ మేజిక్ ట్రిక్ చూపిస్తానంటూ ఇంద్రజాలికుడు చేసిన మాయతో ఇలా నీడ విడివడుతుంది. వీడియోలో తొలుత మహిళ తన రెండు చేతులనూ ముందుకు జాస్తుంది. ఈ క్రమంలో ఇంద్రజాలికుడు(Magician) ఆమె చూపుడు వేళ్లను పట్టుకుంటాడు. ఒక్క నిమిషం ఆగాక చేతులను వెనక్కు తీసుకోమని చెప్పడంతో ఆమె అలాగే చేస్తుంది. అయితే.. చేతి వెంబడి రావాల్సిన నీడ మాత్రం టేబుల్‌పై క్షణకాలం పాటు అలాగే నిలిచిపోతుంది. ఇది చూసిన మహిళ ఒక్కసారిగా భయపడిపోతోంది. ఆమె తేరుకునేలోపే నీడ మళ్లీ యథాస్థితికి చేరుకుంది.

ఇదంతా చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిత్యం వెంట ఉండే నీడను మహిళ నుంచి ఎలా వేరు చేయగలిగాడంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమా లేక గ్రాఫిక్సా? కనికట్టు భలేగా ఉందే? అనుకుంటూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. నెటిజన్లను ఇంతలా ఆకర్షిస్తున్న వీడియోపై(Viral Video) మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-03-25T20:29:17+05:30 IST