Old Couple: ఎస్పీ ఆఫీసుకు భార్యతో కలిసి వచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు.. చేతిలో ఉన్న కాగితంలో ఆ వృద్ధ జంట రాసిన ఫిర్యాదు ఏంటో చదివి...

ABN , First Publish Date - 2023-03-23T20:42:54+05:30 IST

ఎస్పీ కార్యాలయంలోకి అడుగుపెట్టిందో వృద్ధ జంట. భర్త వయసు 85కు పైనే. ఆయనకు కళ్లు సరిగా కనబడవు. చేతి కర్ర తీసుకుని భార్య సాయంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. పెద్దాయన చేతిలోని పేపర్ చూడగానే పోలీసులకు అనుమానం వచ్చింది.

Old Couple: ఎస్పీ ఆఫీసుకు భార్యతో కలిసి వచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు.. చేతిలో ఉన్న కాగితంలో ఆ వృద్ధ జంట రాసిన ఫిర్యాదు ఏంటో చదివి...

ఇంటర్నెట్ డెస్క్: ఎస్పీ కార్యాలయంలోకి అడుగుపెట్టిందో వృద్ధ జంట. భర్త వయసు 85కు పైనే. ఆయనకు కళ్లు సరిగా కనబడవు. చేతి కర్ర తీసుకుని భార్య సాయంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. పెద్దాయన చేతిలోని పేపర్ చూడగానే పోలీసులకు అనుమానం వచ్చింది. అందులో ఆయన రాసుకొచ్చింది చదివి పోలీసులు కూడా ఒకింత ఆవేదనకు గురయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ మొరీనా జిల్లా ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన జగన్నాథ్, ప్రేమవతీ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతో వేరు కాపురం పెట్టారు. జగన్నాథ్ మాత్రం తన భార్యతో కలిసి పెద్ద కొడుకు వద్ద ఉంటారు. అయితే.. పెద్దకోడలు తమను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేస్తోందంటూ వారు తాజాగా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆమె తమకు భోజనం కూడా పెట్టదని, తమపై చేయి కూడా చేసుకుంటుందని ఆరోపించారు. కొడుకు కూడా తన భార్యకే వత్తాసుపలుకుతాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తమను కోడలు కొడుతుండగా పొరుగింట్లోని ఓ వ్యక్తి అడ్డుపడ్డాని, అయితే.. అతడితోనూ తమ కొడుకూ కోడలు గొడవకుదిగారని చెప్పుకొచ్చారు. తనకు ఆదాయవనరుగా మారిన ఒకే ఒక గేదెను కూడా కొడకూకోడలూ అమ్మేసుకున్నారని వాపోయారు. కొడుకూ కోడలూ ఉంటున్న ఇల్లు తనదేనని, వారిని బయటకు వెళ్లగొట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. జీవిత చరమాంకంలో ఉన్న తమకు కాస్తంత మనశ్శాంతి ఇవ్వాలని అభ్యర్ధించారు. తమకు సాయం చేయాలని గతంలో స్థానిక పోలీసులను ఆశ్రయించినా ఉపయోగం లేకపోయిందని, దీంతో నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చామని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Updated Date - 2023-03-23T20:42:54+05:30 IST