ఎరుపు రంగు సిలిండర్‌లో వంట గ్యాస్... మరి నీలం, నలుపు, తెలుపు రంగు సిలిండర్లలో ఏ గ్యాస్ ఉంటుంది? అవి ఎందుకు ఉపయుక్తమవుతాయో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-05-03T13:19:16+05:30 IST

మనం వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్(LPG gas cylinder) ఎరుపు రంగులో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఎల్‌పీజీ మాత్రమే కాకుండా అనేక రకాల గ్యాస్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉపయోస్తారు.

ఎరుపు రంగు సిలిండర్‌లో వంట గ్యాస్... మరి నీలం, నలుపు, తెలుపు రంగు సిలిండర్లలో ఏ గ్యాస్ ఉంటుంది? అవి ఎందుకు ఉపయుక్తమవుతాయో తెలిస్తే...

మనం వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్(LPG gas cylinder) ఎరుపు రంగులో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఎల్‌పీజీ మాత్రమే కాకుండా అనేక రకాల గ్యాస్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉపయోస్తారు. ఎల్‌పిజీ గ్యాస్ నింపిన ఎరుపు రంగు సిలిండర్‌ను(red cylinder) వంటగదిలో వంట చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

అయితే దీనితోపాటు మన జీవితాన్ని సులభతరం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే అనేక రకాల వాయువులు ఉన్నాయి. ఆక్సిజన్(Oxygen), కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్. హీలియం వాయువులను కూడా సిలిండర్లలో నింపుతారు. సిలిండర్‌లో గ్యాస్‌ను నింపడం చాలా సులభం. అయితే వివిధ రకాల వాయువులు నింపాక సిలిండర్లు కలిసిపోతే ఇబ్బంది తలెత్తుతుంది.

అప్పుడు ఏ సిలిండర్‌లో ఏ గ్యాస్‌ ఉన్నదో ఎవరూ గుర్తించలేరు. ఈ కారణంగానే ఒక్కో రకమైన గ్యాస్ సిలిండర్‌కు ఒక్కో రంగు(color) కేటాయించారు, సాధారణంగా ఎల్‌పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ను ఎరుపు రంగు సిలిండర్‌లలో నింపుతారనే విషయం అందరికీ తెలిసిందే. ఆక్సిజన్ వాయువును తెలుపు రంగు సిలిండర్‌లో నింపుతారు.

ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు సాధారణంగా ఆసుపత్రి(hospital)లో కనిపిస్తాయి. ఐస్ క్రీం తయారు చేయడానికి, టైర్ల(tires)లో నింపడానికి ఉపయోగించే నైట్రోజన్ వాయువును నలుపు రంగు సిలిండర్‌లో నింపుతారు. బ్రౌన్ కలర్(Brown color) సిలిండర్‌లో హీలియం వాయువు నింపుతారు. ఈ వాయువును ఎగిరే బెలూన్ల కోసం వినియోగిస్తారు. నీలిరంగు సిలిండర్లలో నైట్రస్ ఆక్సైడ్ వాయువు నిండి ఉంటుంది. దీనిని 'లాఫింగ్ గ్యాస్' అని కూడా అంటారు. బూడిద రంగు సిలిండర్లలో వాణిజ్యపరంగా(Commercially) ఉపయోగించే కార్బన్ డయాక్సైడ్‌ను నింపుతారు.

Updated Date - 2023-05-03T13:25:30+05:30 IST