Internet with LED bulb: ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ.. అదెలా అని డౌటా..?

ABN , First Publish Date - 2023-08-17T21:08:43+05:30 IST

ఎల్‌ఈడీ బల్బుల ద్వారా ఇంటర్నెట్ అందించే లైఫై సాంకేతికపై ప్రస్తుతం పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. వైఫై కంటే మరింత వేగంగా, భద్రంగా సామాచారం బట్వాడా చేసే అవకాశం లైఫై ఇస్తుండంతో ఈ సాంకేతికపై ఆసక్తి పెరుగుతోంది.

Internet with LED bulb: ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ.. అదెలా అని డౌటా..?

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా క్షణం కూడా గడవని కాలంలో మనం ఉన్నాం. బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ కనెక్టివిటీ, ఇళ్లల్లో వైఫైపై మాటల్లో చెప్పలేనంతగా ఆధారపడిపోయారు. వైఫీ టెక్నాలజీ(WiFi) గురించి అందరికీ తెలిసిందే. బ్రాడ్ బ్యాండ్, రూటర్, వంటి సాంకేతిక పదాలు చిన్నారులకు కూడా చిరపరిచితమైపోయాయి. వైఫై అందరికీ తెలిసినా లైఫై(LiFi) గురించి తెలిసిన వారు మాత్రం అరుదనే చెప్పాలి. ఈ నూతన సాంకేతికతో వైఫై కంటే అధిగ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


రేడియో వేవ్స్(Radio Waves) సాయంతో సమాచారాన్ని పంపించే సాంకేతికతనే వైఫై అంటారు. అయితే, రేడియో తరంగాలకు ఉన్న లక్షణాల కారణంగా హ్యాకింగ్ బారి నుంచి తప్పించుకోవడం అంత ఈజీకాదు. పాస్ వర్డ్‌లు ఎన్ని ఉన్నప్పటికీ హ్యాకింగ్ ప్రమాదం వైఫైతో పూర్తిగా తొలగిపోదు. అందుకే శాస్త్రవేత్తలు లైఫైని రూపొందించారు. మన కంటికి కనిపించే కాంతి తరంగాలతో(Light Waves) సమాచారాన్ని ప్రసారం చేయడమే లైఫై సాంకేతిక ముఖ్య లక్షణం. ఇందుకు కోసం జస్ట్ ఒక ఎల్‌ఈడీ బల్బ్‌తో(LED bulb) పాటూ ప్రస్తుత టెక్నాలజీకి చిన్న చిన్న మార్పులు చేస్తే వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు.


800 నుంచి 100 ఎన్ఎమ్ వేవ్‌లెన్త్ గల కాంతి తరంగాల ఆధారంగా లైఫై పరిజ్ఞానం పనిచేస్తుంది. ఇందులో 10ఎమ్‌బీపీఎస్ నుంచి గరిష్ఠంగా 9.6జీబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నె్ట్ కనెక్టివటీ పొందొచ్చు. మనిషి కన్ను గుర్తుపట్టలేనంత వేగంగా బల్బును ఆన్ ఆఫ్ చేయడం ద్వారా సమాచారం బట్వాడా అవుతుంది. ఎల్ఈడీ బల్బులు, లేసర్ డయోడ్, సిలికాన్ ఫొటో డయోడ్ వంటి వాటితో సులభంగా లైఫైని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక సమాచారాన్ని కూడా హ్యాకింగ్ బెడద లేకుండా పంపించుకోవచ్చు. వైఫైతో పోలిస్తే ఈ టెక్నాలజీతో అనేక రకాల ఉపయోగాలు ఉండటంతో ఈ సాంకేతికతను మరింత విస్తృతపరిచేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-08-17T21:14:14+05:30 IST