Bollywood: రోజుకు రూ.2కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో

ABN , First Publish Date - 2023-01-22T16:21:53+05:30 IST

ఓ చిత్రంలో నటించినందుకు కార్తిక్ రూ.20కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడని గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఈ రూమర్స్‌పై కార్తిక్ తాజాగా స్పందించాడు.

Bollywood: రోజుకు రూ.2కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో

సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్‌నామా’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్ 2’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఓ చిత్రంలో నటించినందుకు కార్తిక్ రూ.20కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడని గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఈ రూమర్స్‌పై కార్తిక్ తాజాగా స్పందించాడు.

కార్తిక్ ఆర్యన్ గతంలో ‘ధమాకా’ (Dhamaka) లో నటించాడు. రామ్ మధ్వానీ (Ram Madhvani) దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో నటించినందుకు కార్తిక్ రూ.20కోట్లను పారితోషికంగా తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై కార్తిక్ తాజాగా ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘‘మొదటి సినిమాలో నటించినందుకు నాకు రూ.1.25లక్షలను రెమ్యూనరేషన్‌‌గా ఇచ్చారు. ఆ సమయంలో నేను బాధపడిపోయాను. కరోనా సమయంలో ‘ధమాకా’ చిత్రం కోసం నేను పది రోజుల పాటు పనిచేశాను. నా పారితోషికంగా రూ.20కోట్లను తీసుకున్నాను. నేను నిర్మాతల డబ్బును 20రోజుల్లోనే రెట్టింపు చేస్తున్నాను. అందువల్ల నాకు అంత రెమ్యూనరేషన్ చెల్లించడం సబబే’’ అని కార్తిక్ ఆర్యన్ తెలిపాడు. ఇక కార్తిక్ కెరీర్ విషయానికి వస్తే.. ‘భూల్ భూలయ్యా 2’ (Bhool Bhulaiyaa 2)లో చివరగా కనిపించాడు. హార్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇబ్బందుల్లో కూరుకుపోయిన బాలీవుడ్‌కు కొత్త వెలుగులను తీసుకువచ్చింది. తాజాగా ‘షెహజాదా’ లో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురంలో’ కీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.

Updated Date - 2023-01-22T16:24:51+05:30 IST