Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

ABN , First Publish Date - 2023-02-11T17:15:31+05:30 IST

మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఎటువంటి సంకోచం లేకుండా రాజకీయాలు, సమకాలీన అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.

Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఎటువంటి సంకోచం లేకుండా రాజకీయాలు, సమకాలీన అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. కంగన తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan)పై విమర్శలు గుప్పించారు. తన పేరును ప్రస్తావించడానికి కూడా ఆమిర్ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.

ఆమిర్ ఖాన్ చివరగా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) లో నటించారు. అనంతరం ఏడాదిన్నర పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు చెప్పారు. మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆమిర్ ప్రముఖ ఇండియన్ నవలిస్ట్, రచయిత శోభా డే (Shobha De) రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. అయితే, ఓ విలేకరి..‘‘శోభా డే బయోపిక్ తీస్తే ఆమె పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది’’ అని ప్రశ్న అడిగారు. ‘‘ప్రియాంక చోప్రా (Priyanka Chopra), దీపికా పదుకొణె (Deepika Padukone), ఆలియా భట్ (Alia Bhatt) అద్భుతంగా నటిస్తారు. శోభా డే పాత్రకు వీరు వెంటనే నాకు గుర్తుకొస్తున్నారు’’ అని ఆమిర్ చెప్పారు. అయితే, పక్కనే ఉన్న శోభా డే వెంటనే కలుగజేసుకొని కంగన పేరు చెప్పారు. ‘‘ఆమె కూడా అద్భుతమైన నటే. అనేక కొత్త రకాల పాత్రలను పోషిస్తుంది’’ అని ఆమిర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కంగన దృష్టికి కూడా చేరింది. ఫలితంగా ఆమిర్‌ను విమర్శిస్తూ ఆమె పోస్ట్ పెట్టారు. ‘‘మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నా పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించకుండా ఉండటానికి ఆమిర్ ఖాన్ ఎంతగానో ప్రయత్నించారు. నా, శోభ‌ రాజకీయ అభిప్రాయాలు పరస్పర విరుద్ధమయినవి. అయినప్పటికీ, నా నటన, కళ, శ్రమ‌ను ప్రశసించడానికి ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇది అద్దం పడుతుంది. మీ కొత్త పుస్తకానికి నా శుభాకాంక్షలు’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-11T17:20:12+05:30 IST