Jyothika : విలక్షణ తారలో ఇంత టాలెంట్‌ ఉందా?

ABN , First Publish Date - 2023-02-25T13:45:37+05:30 IST

తమిళ స్టార్‌ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి పరిచయం అవసరం లేదు. కథానాయికగా గ్లామర్‌ పాత్రలతోపాటు బాధ్యతాయుతమైన పాత్రలను ఆమె పోషించి మెప్పించారు. సూర్యతో వివాహం అనంతరం నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చి గృహిణిగా ఇల్లు, ఇద్దరి పిల్లల బాధ్యతతో ముందుకెళ్తున్నారు.

Jyothika : విలక్షణ తారలో ఇంత టాలెంట్‌ ఉందా?

తమిళ స్టార్‌ హీరో సూర్య భార్య జ్యోతిక(Jyothika) గురించి పరిచయం అవసరం లేదు. కథానాయికగా గ్లామర్‌ పాత్రలతోపాటు బాధ్యతాయుతమైన పాత్రలను ఆమె పోషించి మెప్పించారు. సూర్యతో వివాహం అనంతరం నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చి గృహిణిగా ఇల్లు, ఇద్దరి పిల్లల బాధ్యతతో ముందుకెళ్తున్నారు. అప్పుడప్పుడు కథానాయిక, నటనకు ఆస్కారమున్న కథలు కుదిరితే అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు సొంత నిర్మాణ సంస్థ పనులూ చూసుకుంటున్నారు. తాజాగా ఓ వేదికపై జ్యోతిక తనలోని ఓ స్టంట్‌ స్కిల్‌ను (jyothika Fight talent) బయటపెట్టి ఆహుతుల్ని ఆశ్చర్యపరచింది. అందరి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్‌ ఫంక్షన్‌లో జ్యోతిక చీరకట్టులో మెరిశారు. అదే వేదికపై చీరలోనే కర్రసాము (jyothika stick Fight) చేస్తూ ఎగురుతూ రెండు రింగులు తిరిగారు సింగిల్‌ హ్యాండ్‌తో కర్రను అలవోకగా తిప్పారు. అక్కడున్న సీనియర్‌ నటి రేవతి తదితరులు ఎప్పుడూ హోమ్లీగా కనిపించే జ్యోతికలో ఇంతటి స్టంట్‌ టాలెంట్‌ ఉందా అని ఆఽశ్చర్యంగా చూశారు. చప్పట్లతో అభినందించారు. నెటిజన్లు సైతం జ్యోతికలో ఇంత టాలెంట్‌ ఉందా అని సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-02-25T14:20:35+05:30 IST