Marriage: బంపరాఫర్ అంటే ఇదేనేమో.. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వమే రూ.3 లక్షల డబ్బు ఇస్తుందట..!

ABN , First Publish Date - 2023-07-12T11:49:54+05:30 IST

మన దేశంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతుంది. పెళ్ళిళ్ళు రోజు జరుగుతున్నాయి కానీ.. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండి మగవారికి పెళ్ళిళ్ళు జరగని పరిస్థితి ఏర్పడింది.

Marriage: బంపరాఫర్ అంటే ఇదేనేమో.. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వమే రూ.3 లక్షల డబ్బు ఇస్తుందట..!
populated country

ఈ దేశంలో ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే 3 లక్షల రూపాయలు వస్తాయట. ఇది ఎక్కడా లేని సాంప్రదాయం, నిజానికి పెళ్ళి అనగానే వధువు తరపు నుంచి కట్నం రూపంలో, కానుకల రూపంలో చాలానే నగదు ముడుతుంది. ఇది మన వైపు ఉన్న సాంప్రదాయం. అయితే మన దేశంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతుంది. పెళ్ళిళ్ళు రోజు జరుగుతున్నాయి. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండి మగవారికి పెళ్ళిళ్ళు జరగని పరిస్థితి ఏర్పడింది.

అయితే ఉన్న ఆడపిల్లలు సరైన మగపిల్లవాడు భర్తగా రావాలని గొప్పగా సంపాదించాలని చూస్తున్నారట. ఇది ప్రస్తుతం మన భారతదేశ పెళ్ళిళ్ళ పరిస్థితి. అయితే ఐరోపా దేశంలో దీనికి కాస్త భిన్నంగా ఉంది పరిస్థితి. అక్కడ 2011 నాటికి జనాభా లెక్కల ప్రకారం ఐరోపా దేశమైన ఐస్ లాండ్ జనాభా 3.73 లక్షలు మాత్రమే. అయితే పూర్వం ఈ జనాభా మరీ తక్కువగా ఉండేదట.

ఈ ఐస్ లాండ్ మగవారు ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకోవాలంటేనే భయపడతారట. అందుకని ఇక్కడి అమ్మాయిలు పెళ్ళి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి పరిష్కారంగా అత్తింటివారు ఇచ్చే కట్నకానుకలు కాకుండా ప్రభుత్వం నుంచి కూడా కానుకలు అందుతాయనే ఆశ పెట్టి మరీ పెళ్ళిళ్ళు జరిపిస్తుందట అక్కడి ప్రభుత్వం.


ఇది కూడా చదవండి: తలస్నానం చేసిన ప్రతీసారీ జుట్టు ఊడిపోతోందా..? షాంపూ కారణమే కాదు.. అసలు నిజమేంటంటే..!

పెళ్లి చేసుకోవడానికి జంకే అబ్బాయిలందరికీ భరోసాగా ఐస్ లాండ్ ప్రభుత్వం వరుడి చేతిలో ప్రభుత్వం తరపునుంచి 3 లక్షలను అందిస్తుంది. అదేదో పెళ్ళప్పుడు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం కాకుండా ప్రతినెలా 3 లక్షల రూపాయలను అందిస్తుందట. ఇదేదో బంపర్ ఆఫర్ లా ఉంది కదా..అక్కడి ఆడపిల్ల పెళ్ళిని ఆ దేశ పౌరసత్వం తీసుకుంటుంది. ఎంత చక్కని భరోసానో కదా..

అయితే ఐస్ లాండ్ ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో అక్కడే ఓ ఇల్లు కొనుక్కోవాలి. ఇది అక్కడి ప్రభుత్వం పెట్టిన రూల్. ఇదేదో బావుంది కదా .. పెళ్ళి చేసి ఓ ఇంటివాళ్ళను కూడా ప్రభుత్వమే చేస్తుంది. ఐస్ లాండ్ లో బ్లూ లగూన్, గల్ఫోస్, గోల్డెన్ సర్కిల్ లాంటి అందమైన ప్రదేశాల్లానే అక్కడి అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు. ఇంకెందు ఆలస్యం ఇక్కడ పెళ్ళి కాని ప్రసాదులంతా అటు బయలుదేరితే సరి. పెళ్ళితో పాటు ఇంటివాళ్ళను చేసే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని చక్కబెడుతుంది. బయలుదేరండి మరి. అయితే ఇది అధికారికంగా నిరూపణ కాలేదు.

Updated Date - 2023-07-12T11:49:54+05:30 IST