Share News

Sugar Vs Jaggery: బెల్లం, చెక్కరా రెండూ చెరకు నుంచే చేస్తారుగా? అయినా చెక్కర కంటే బెల్లం ఎందుకు మెరుగంటే..

ABN , First Publish Date - 2023-11-12T19:38:23+05:30 IST

బెల్లం, చెక్కర రెండింట్లో ఏది మేరుగో చెప్పే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Sugar Vs Jaggery: బెల్లం, చెక్కరా రెండూ చెరకు నుంచే చేస్తారుగా? అయినా చెక్కర కంటే బెల్లం ఎందుకు మెరుగంటే..

ఇంటర్నెట్ డెస్క్: స్వీట్లు నచ్చని వారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. స్వీట్లను చూడగానే ఒకటో రెండో కడుపులో వేసుకోవాలని అందరికీ అనిపిస్తుంది. అయితే, వీటిల్లో చెక్కర స్థాయిలు ఎక్కువగా ఉండటంతో డయాబెటిక్ పేషంట్లు స్వీట్లను చూసి వెనకడుగు వేస్తారు. కానీ చెక్కర(Sugar) కంటే బెల్లంతో(Jaggery) చేసిన స్వీట్లు మంచివని కూడా మనం చాలా సార్లు వినే ఉంటాం. మరి, చెక్కర, బెల్లం రెండూ చెరకు రసం నుంచే తయారవుతాయి కదా? అయినా బెల్లం బెటరనే(Sugar Vs Jaggery) వాదన ఎందుకు తెరపైకి వచ్చిందో మీకు కెప్పుడైనా సందేహం కలిగిందా. దీనికి సమాధానం నా దగ్గర ఉందంటూ ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌(Viral video) అవుతోంది.

Google: అలర్ట్.. గూగుల్ కీలక నిర్ణయం! మీకు ఒకటికంటే ఎక్కువ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, చెక్కర, బెల్లం తయారీకి ముడిసరకు చెరకు రసమే(Sugarcane juice). దాన్ని బాగా మరగబెట్టి చల్లారుస్తారు. దీంతో, బల్లెం తయారీ పూర్తవుతుంది. కానీ ఈ మరగబెట్టిన చెరకు రసాన్ని అదనపు రసాయనాలతో శుద్ధి చేస్తేనే చెక్కర వస్తుంది. ఈ క్రమంలో ఫాస్ఫోరిక్ యాసిడ్ వంటి రసాయనాల్ని వాడతారు. అయితే, ఇలాంటి రసాయనాలతో చెరకులో ఉన్న పోషక పదార్థాలన్ని పోయి కేవలం గ్లూకోజ్ మాత్రమే మిగులుతుందట. ఉత్త గ్రూకోజ్ అధికంగా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లకు అనారోగ్యం కాబట్టి చెక్కర కంటే బెల్లం బెటరని వీడియోలో తేల్చారు.

Viral: అదృష్టం అంటే ఈమెదే! ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడిందో చూస్తే దిమ్మతిరగాల్సిందే!


దీంతో, ఈ వీడియోపై నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. చాలా మంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, డయాబెటిక్ పేషెంట్లకు బెల్లంతోనూ ఇబ్బంది తప్పదని కొందరు చెప్పారు. బెల్లం గ్లైసీమిక్ ఇండెక్స్‌కు ఎక్కువేనని ఈ సందర్భంగా వెల్లడించారు. బెల్లం చెక్కర కంటే మెరుగు కావచ్చేమో కానీ పరిమితికి మించి వాడితో బెల్లంతోనూ మధుమేహ వ్యాధి గ్రస్తులకు సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Longest Car: భలే కారు.. లోపల స్విమ్మింగ్ పూల్.. హెలికాఫ్టర్ దించేందుకు హెలీ ప్యాడ్..

Updated Date - 2023-11-12T19:40:55+05:30 IST