Anushka Shetty: స్వీటీతో ఎవడీ క్యూటీ.. టైటిల్‌ ఇదేనా?

ABN , First Publish Date - 2023-02-28T19:38:17+05:30 IST

ఫ్రెండ్‌ క్యారెక్టర్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నవీన్‌ పోలిశెట్టి ‘ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ర్టీ చూపు తన వైపు తిప్పుకున్నాడు.

Anushka Shetty: స్వీటీతో ఎవడీ క్యూటీ.. టైటిల్‌ ఇదేనా?

ఫ్రెండ్‌ క్యారెక్టర్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నవీన్‌ పోలిశెట్టి (naveen polishetty) ‘ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ర్టీ చూపు తన వైపు తిప్పుకున్నాడు. వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా నవీన్‌.. యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! మహేష్‌ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్‌ సరసన అనుష్క శెట్టి (Anushka Shetty)నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అనుష్క ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో స్వీటీ చెఫ్‌గా కనిపిస్తునట్లు ఆ పోస్టర్‌లో రివీల్‌ చేశారు. షూటింగ్‌ ఎప్పుడో మొదలైన ఈ చిత్రం గురించి ఇప్పటి వరకూ సరైన అప్‌డేట్‌ రాలేదు. దీనితో ఒక్కసారిగా అనుష్క అభిమానులు యు.వి క్రియేషన్స్‌ సంస్థపై అసహనం వ్యక్తం చేస్తు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశాడు. దీంతో ఎట్టకేలకు ఈ చిత్రం అప్‌డేట్‌ ఇచ్చారు. బుధవారం ఈ సినిమా టైటిల్‌ ప్రకటించనున్నట్లు నవీన్‌ పోలిశెట్టి ఓ వీడియో ద్వారా తెలిపారు. Anushka New movie title on wednesday)

ఈ విషయాన్ని తనదైశ శైలిలో రివీల్‌ చేశాడు నవీన్‌. అనుష్కతో మాట్లాడుతున్నట్లు వీడియోలో మాట్లాడుతూ ఆమె అటెన్షన్‌ కోసం తిప్పలు పడుతున్నట్లు కనిపించాడు. ‘స్వీట్‌ ఎంతోమంది స్టార్‌ హీరోలతో కలిసి నటించినా తన ఫేవరేట్‌ హీరోను నేనే అట. అలాగని బయట చెప్పుకుంటున్నారు అని సరదాగా సంభాషించాడు. ఇదంతా మీడియా ముందు చెప్పడం సిగ్గు కదా అంటూ సిగ్గు మొగ్గలేశాడు. అనుష్క సినిమా పోస్టర్లను చూపిస్తూ రెండు, మూడు టైటిల్స్‌ను చెప్పుకొచ్చాడు. ‘దేవసేన నీ మనసులో ఉన్నది.. నేనేనా అని ఒకటి.. స్వీటీతో ఎవడీ క్యూటీ.. అంటూ టైటిల్స్‌ చెబుతుండగా అనుష్క కోపంతో ఉన్న పోస్టర్స్‌ చూపించి నవ్వించాడు. ఫైనల్‌గా రేపు టైటిల్‌ వస్తుంది వెయిట్‌ చేయండి అని సెలవిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రారంభః నుంచి ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ అనే టైటిల్‌ అనుకుంటునట్లు ప్రచారం సాగుతోంది.

Updated Date - 2023-02-28T19:38:17+05:30 IST