Share News

Shocking: తండ్రి చేసిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన 8 ఏళ్ల బాలిక.. తల్లిని తన కళ్లముందే..

ABN , Publish Date - Dec 26 , 2023 | 08:43 PM

భార్య తనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవడంతో రగిలిపోయిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన కన్నబిడ్డ ముందే భార్యను చంపి ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Shocking: తండ్రి చేసిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన 8 ఏళ్ల బాలిక.. తల్లిని తన కళ్లముందే..

ఇంటర్నెట్ డెస్క్: భార్య తనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవడంతో రగిలిపోయిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన కన్నబిడ్డ ముందే భార్యను చంపి ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లీ నేలకొరగడం ఆ 8 ఏళ్ల బాలిక ప్రత్యక్షంగా చూసింది. అమెరికాలోని (USA) హవాయ్ రాష్ట్రంలో (Hawaii) గత వారం ఈ ఘటన వెలుగు చూసింది.

మృతురాలు థెరిసా కేచుయేలా (33) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. దాదాపు పదేళ్ల పాటు భర్తతో కలిసున్న ఆమె కాపురంలో కలతల కారణంగా కొంత కాలం నుంచీ భర్తకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య విడాకులు ఇచ్చేందుకు కూడా నిర్ణయించుకున్నారు. అయితే, భార్య తనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవడాన్ని జేసన్ కేచుయేలా భరించలేకపోయాడు. భార్య ముందే ఆత్మహత్య చేసుకుంటానంటూ పలుమార్లు ఆమెను బెదిరించాడు. ఓ సందర్భంగా ఆమె మెడపై కత్తికూడా పెట్టి బెదిరింపులకు దిగాడు.


2.jpgఈ క్రమంలో శుక్రవారం థెరెసాను పెర్ల్ రిడ్జ్ సెంటర్‌లోని ఓ పార్కింగ్ స్థలంలో కన్నకూతురు చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు (Husband kills wife, commits suicide). కేసు దర్యాప్తు సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వేధింపులు తాళలేక థెరిసా అతడు తన వెంటపడకుండా ఉండాలంటూ కోర్టు నుంచి టీఆర్వో ఆదేశాలు కూడా తెచ్చుకుంది. అయితే, బిడ్డల్ని కలుసుకునే సమయంలో మాత్రం అతడికి టీఆర్వో ప్రకారం అనుమతి ఉన్నట్టు తెలుస్తోంది.

కన్న తండ్రి దారుణాన్ని అతడి చిన్న కూతురు ప్రత్యక్షంగా చూసి షాకైపోయిందని థెరిసా తల్లి మీడియాకు తెలిపింది. తల్లి ఇక రాదంటే తన మనమరాలు ఇప్పటికీ నమ్మలేకపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నా కూతురిని చంపుతానని అతడు పలుమార్లు హెచ్చరించాడు. కానీ అతడిని పోలీసులు అరెస్టు చేయలేదు. అతడి ఇంట్లో తుపాకీలు దొరికినా పట్టించుకోలేదు. వ్యవస్థలు నా బిడ్డ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయి’’ అంటూ థెరిసా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 08:50 PM