Research: అలా చేస్తే 150 ఏళ్లు బతకొచ్చట.. యూఎస్ వైద్యుడి రీసర్చ్‌లో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2023-09-24T09:15:55+05:30 IST

అమెరికాకు చెందిన డాక్టర్ ఎర్నెస్ట్ వాన్ స్వ్కార్జ్(Dr. Ernst von Schwarz).. రిసర్చ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులపై ఆయన చేసిన రిసర్చ్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించి మనిషి శరీరంలో నిర్వీర్యం అవుతున్న కణాలకు పునరుజ్జీవనం కల్పించాలి. తద్వారా కణాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించి.. జీవితకాలాన్ని పెంచుతాయనేది ఈ రిసర్చ్ సారాంశం.

Research: అలా చేస్తే 150 ఏళ్లు బతకొచ్చట.. యూఎస్ వైద్యుడి రీసర్చ్‌లో సంచలన విషయాలు

న్యూయార్క్: మారుతున్న జీవన శైలి(Life Style) మనిషి సగటు జీవిత కాలాన్ని రోజు రోజుకీ తగ్గిస్తూ ఉండగా ఓ యూఎస్(USA) వైద్యుడు చేసిన రిసర్చ్ ఇప్పుడు మరికొన్ని రోజులు బతకాలనుకునే వారికి తీపి కబురునందించింది. 60 ఏళ్లు ఎలాంటి జబ్బు రాకుండా జీవించడం పెద్ద టాస్క్ లా మారిన ఈ రోజుల్లో కొంచం ప్రయత్నిస్తే మనిషి జీవితకాలాన్ని 120 నుంచి 150 ఏళ్ల వరకు పొడగించవచ్చట. ఇదంతా నమ్మబుద్ధి కావట్లేదు కదూ.. కానీ ఓ డాక్టర్(Doctor) మాత్రం ఈ విషయాన్ని బలంగా వాదిస్తున్నాడు. ఇంతకు ఎవరా డాక్టర్.. ఏంటా రీసర్చ్‌ చదివేద్దాం పదండీ..


అమెరికాకు చెందిన డాక్టర్ ఎర్నెస్ట్ వాన్ స్వ్కార్జ్(Dr. Ernst von Schwarz).. ఓ కార్డియాలజిస్ట్(Cardiologist). ఆయన 'సీక్రెట్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ', "ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీ" వంటి పుస్తకాలను రాశారు. ఏళ్లుగా మానవ కణాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన తాజా రిసర్చ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులపై ఆయన చేసిన రిసర్చ్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించి మనిషి శరీరంలో నిర్వీర్యం అవుతున్న కణాలకు పునరుజ్జీవనం కల్పించాలి. తద్వారా కణాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించి.. జీవితకాలాన్ని పెంచుతాయనేది ఈ రిసర్చ్ సారాంశం. దీంతో పాటు జీవన శైలి మార్చుకోవాలని.. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ శతాబ్దం చివరి నాటికి మనిషి ఆయుషును 120 ఏళ్ల నుంచి 150 ఏళ్లకు పెంచవచ్చని డాక్టర్ ఎర్నెస్ట్ అభిప్రాయం. ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్మెంట్ 122 సంవత్సరాల 164 రోజుల వరకు జీవించాడు. ఇదే ఇప్పటివరకున్న అతి పెద్ద రికార్డు.

Updated Date - 2023-09-24T09:29:22+05:30 IST