రైలు టికెట్ ఎక్కడో పోయిందా?... డూప్లికేట్ కాపీని ఇలా పొందండి!
ABN , First Publish Date - 2023-01-22T12:23:26+05:30 IST
రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే మీ రైలు టికెట్ పోయినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే భారతీయ రైల్వే నిబంధనలలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది.
రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే మీ రైలు టికెట్ పోయినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే భారతీయ రైల్వే నిబంధనలలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మీరు పోగొట్టుకున్న టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో తిరిగి పొందడానికి, ఐఆర్సీటీసీ ఖాతాకు లాగిన్ అయి, బుకింగ్ హిస్టరీ నుండి డూప్లికేట్ టిక్కెట్‌ను తిరిగి పొందవచ్చు. దాని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. అయితే
డూప్లికేట్ టికెట్ పొందడానికి కొంత రుసుము చెల్లించాలి. స్లీపర్, సెకండ్ స్లీపర్ క్లాస్ కోసం డూప్లికేట్ టిక్కెట్‌ను ప్రాసెస్ చేయడానికి 50 రూపాయలు వసూలు చేస్తారు. ఏసీ కోచ్‌లో సీటు అయితే డూప్లికేట్ టికెట్ జారీకి ఛార్జీ రూ. 100 చెల్లించాలి. రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కన్ఫర్మ్ చేసిన టికెట్ పోతే, డూప్లికేట్ టికెట్ పొందడానికి మీరు మీ ఛార్జీలో 50 శాతం చెల్లించాలి. కన్ఫర్మేషన్ తర్వాత ప్రయాణీకుల టికెట్ చిరిగితే, 25 శాతం ఛార్జీతో డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు డూప్లికేట్ టిక్కెట్టు జారీ చేయరు. రైలు బయలుదేరే ముందు మీరు పోగొట్టుకున్న ఒరిజినల్ టికెట్ దొరికితే, మీరు డూప్లికేట్ టిక్కెట్‌ను తిరిగి రైల్వే కౌంటర్‌లో సమర్పించి, అసలు టిక్కెట్‌ను వారికి చూపించి డబ్బు తిరిగి తీసుకోవచ్చు.