కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనేముందు ఈ ఈ 5 విషయాలు తెలుసుకోకుంటే...

ABN , First Publish Date - 2023-01-25T10:46:54+05:30 IST

5జీ ఇప్పుడు భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకుంది. ఎయిర్‌టెల్, జియో రెండూ ఇప్పటికే దేశంలో తమ 5జీ సేవలను ప్రారంభించి, విస్తరించాయి. వోడాఫోన్ వంటి ఇతర టెలికాం కంపెనీలు

కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనేముందు ఈ ఈ 5 విషయాలు తెలుసుకోకుంటే...

5జీ ఇప్పుడు భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకుంది. ఎయిర్‌టెల్, జియో రెండూ ఇప్పటికే దేశంలో తమ 5జీ సేవలను ప్రారంభించి, విస్తరించాయి. వోడాఫోన్ వంటి ఇతర టెలికాం కంపెనీలు ఎటువంటి టైమ్‌లైన్ ఇవ్వలేదు. కానీ తమ 5జీ ప్రయాణం ప్రారంభమైందని చెప్పాయి. మొబైల్ కస్టమర్లు ఇప్పుడు 5జీ సాంకేతికత కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ఉంటే మాత్రమే 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించగలుగుతారు. 5జీ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసేముందు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి

5జీ చిప్‌సెట్‌

5జీ ఫోన్‌లో చిప్, ఫోన్ రెండూ ఎంఎంవేవ్, సబ్-6జీహెచ్‌జెడ్‌కి మద్దతు ఇస్తాయో లేదో చూడాలి. ఎందుకంటే కేవలం ఎంఎంవేవ్ 5జీ బ్యాండ్ మాత్రమే అత్యుత్తమ 5జీ వేగాన్ని ఇస్తుంది.

ఏ బ్యాండ్‌కు మద్దతు?

కొత్త 5జీ ఫోన్‌లో మీరు చూడవలసిన మరో ముఖ్యమైన విషయం బ్యాండ్‌. 11 5జీ బ్యాండ్‌లు లేదా అంతకంటే ఎక్కువ బ్యాండ్‌లు ఉన్న 5జీ ఫోన్‌లను మాత్రమే కొనుగోలు చేయండి.

నూతన 5జీ స్మార్ట్‌ఫోన్‌

కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం షాపింగ్ చేసేటప్పుడు కొత్తగా విడుదల చేసిన 5జీ పోను కొనుగోలు చేయండి. పాత ఫోన్‌లు ఆకర్షణీయమైన ధరలతో మిమ్మల్ని ప్రలోభపెట్టవచ్చు. అవి పరిమిత 5జీ సేవలను అందించవచ్చు.

బ్యాటరీని తనిఖీ

ఇంటర్నెట్ స్పీడ్ విషయానికి వస్తే, 5జీ ఫోన్‌లలో బ్యాటరీని చూడటం కూడా చాలా ముఖ్యం. ఫోన్ స్క్రీన్ కొంచెం చిన్నగా ఉంటే, 4500mAh బ్యాటరీ సరిపోతుంది. ఐఫోన్ 13 సిరీస్ లేదా ఐఫోన్ 14 సిరీస్ వంటి కొత్త మోడల్‌లు మంచి బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

బడ్జెట్ ఫోన్‌ విషయంలో..

నూతన సాంకేతికత, 5జీ చిప్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఫలితంగా 5జీ బ్యాండ్‌లతో రూ. 15,000 లోపు ధరలో 5జీ ఫోను కొనుగోలు చేయడం సాధ్యమేనని చెప్పవచ్చు. డిస్‌ప్లే రిజల్యూషన్, కెమెరా సెన్సార్ మొదలైన ఇతర ఫీచర్‌లలో ఈ ఫోన్‌లు కొంత రాజీ పడతాయని చెప్పవచ్చు.

Updated Date - 2023-01-25T10:46:55+05:30 IST