ఏ భాష రానివాని వారి ఆలోచనా తీరు ఎలా ఉంటుంది? వారు దేనినైనా ఎలా గుర్తుంచుకుంటారో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-05-06T08:21:24+05:30 IST

మనిషికి ఆలోచించగలిగిన శక్తి ఉన్నకారణంగానే అన్ని జీవరాసులకంటే భిన్నంగా ఉన్నాడు. ఆలోచించే సామర్థ్యం(Ability to think) మనిషిని అభివృద్ధి వైపు పయనింపజేసింది.

ఏ భాష రానివాని వారి ఆలోచనా తీరు ఎలా ఉంటుంది? వారు దేనినైనా ఎలా గుర్తుంచుకుంటారో తెలిస్తే...

మనిషికి ఆలోచించగలిగిన శక్తి ఉన్నకారణంగానే అన్ని జీవరాసులకంటే భిన్నంగా ఉన్నాడు. ఆలోచించే సామర్థ్యం(Ability to think) మనిషిని అభివృద్ధి వైపు పయనింపజేసింది. అందరికీ నిరంతరం ఏదో ఒక ఆలోచన కలుగుతూనే ఉంటుంది. మనిషికి ఆలోచనలనేవి అతను మాట్లాడే సొంత భాష(own language)లోనే వస్తుంటాయనేది విదితమే.

అయితే ఎవరైనా పుట్టుకతో వినలేకపోయినా, మాట్లాడలేకపోయినా వారూ కూడా నిరంతరం ఆలోచిస్తారు. దీని వెనుకగల సైన్స్(Science) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనకు భాషతో సంబంధం లేకుండా కొన్ని అనుభూతులు కలుగుతుంటాయి. భావోద్వేగం(emotion) కూడా కలుగుతుంటుంది. మెంటల్ ఫ్లాస్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం ప్రపంచంలో చాలా మంది కళాకారులు, శాస్త్రవేత్తలు(Scientists) సమస్యల పరిష్కారానికి భాషకు బదులు చిత్రాలను ఉపయోగిస్తారు. అంటే ఇటువంటివారికి ఏదైనా అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి చిత్రాలు(Pictures) అవసరం అవుతాయి.

వినలేనివారు తమ మనసులో చిత్రాలను రూపొందించుకుంటారు. వినికిడి శక్తిలేనివారికి జ్ఞాపకశక్తి(memory) అనేది మిగిలినవారికన్నా భిన్నంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ మెంటల్ ఫ్లోస్(Mental Flows) నివేదించింది. 15 ఏళ్ల వ్యక్తి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు, తనకు 8 లేదా 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలను ఇతరులతో సైన్ లాంగ్వేజ్(Sign language) ద్వారా పంచుకోగలుగుతాడు. అతనికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సైన్ లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ నాటి అనుభవాలను తన మనసులో దృశ్య రూపంలో గుర్తుంచుకున్నాడని పరిశోధకులు(Researchers) గ్రహించారు.

Updated Date - 2023-05-06T08:25:29+05:30 IST