రాబోయే హాలిడేస్‌లో ఎంజాయ్ చేయాలంటే ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిందే..
ABN , First Publish Date - 2023-01-09T11:35:32+05:30 IST
మనలో చాలామంది మకర సంక్రాంతి, జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు.
మనలో చాలామంది మకర సంక్రాంతి, జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈసారి జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 26న ఆదివారం గణతంత్ర దినోత్సవం. ఈ రెండు రోజులలో ఎంజాయ్ చేయడానికి కొన్ని ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అవేమిటో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోవాలోని అందమైన బీచ్‌లు
మీరు రిపబ్లిక్ డే లేదా మకర సంక్రాంతి సెలవుల్లో ఆనందించడానికి గోవా వెళ్ళవచ్చు. ప్రస్తుతం గోవాలో అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడ నైట్ పార్టీలతో పాటు బీచ్‌లో విహరిస్తూ ఆనందించవచ్చు. ఈ సెలవు రోజులు గోవాలో ఎంజాయ్ చేయడానికి ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు.
కుమరకోమ్‌లో..
కేరళలోని వెంబనాడ్ సరస్సు ఒడ్డున ఉన్న కుమరకోమ్ అనే చిన్న పట్టణం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. మకర సంక్రాంతి పండుగను దక్షిణ భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకోవడానికి, మీరు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనందించవచ్చు.
బరోగ్‌లో..
బరోగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ఆఫ్‌బీట్ గమ్యస్థానాలలో ఒకటి. హిమపాతంతో పాటు చలిని ఆస్వాదించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తారు. మకర సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల ప్రత్యేక వేడుకలను చూసేందుకు ఇది సరైన ప్రదేశం. బడోంగ్ రైల్వే స్టేషన్ ఎంతో ప్రసిద్ధి చెందింది.
బిన్సార్‌లో..
మీరు మకర సంక్రాంతి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైనా విభిన్నతను సందర్శించాలనుకుంటే ఉత్తరాఖండ్‌లోని బిన్సార్‌లో పర్యటనను ఎంతగానో ఆస్వాదించవచ్చు. మకర సంక్రాంతి సమయంలో ఇక్కడ మంచు కురుస్తుంది. ఇంతేకాకుండా నందా దేవి శిఖరం దృశ్యం ఇక్కడ నుండి ఎంతో అందంగా కనిపిస్తుంది.