chanakya niti: ఆ ఒక్కటీ వదిలేస్తే జీవితమంతా సంతోషమే... లక్ష్యం కరతలామలకం!

ABN , First Publish Date - 2023-01-18T12:35:10+05:30 IST

ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటాడు. కానీ కొన్నిసార్లు దుర్భర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ కారణంగా సంతోషకరమైన జీవితాన్ని గడపడంలో సమస్యలను ఎదుర్కొంటాడు.

chanakya niti: ఆ ఒక్కటీ వదిలేస్తే జీవితమంతా సంతోషమే... లక్ష్యం కరతలామలకం!

ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటాడు. కానీ కొన్నిసార్లు దుర్భర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ కారణంగా సంతోషకరమైన జీవితాన్ని గడపడంలో సమస్యలను ఎదుర్కొంటాడు. చాణక్య నీతి అనేది ఆచార్య చాణక్యుడు రచించిన గొప్ప రచన. ఇది జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. ఇందులో ఆచార్య జీవితంలోని లోతైన రహస్యాలు, ఆనందానికి సంబంధించిన మార్గాల గురించి వివరంగా తెలియజేశారు.

ఆచార్య చాణక్యుడి మాటలు కటువుగా ఉన్నా, వాటిలో దాగివున్న అర్థాన్ని ఆకళింపు చేసుకుని, వాటిని అనుసరించే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా, విజయవంతమైన జీవితాన్ని గడుపుతాడు. అదే సమయంలో సమాజంలో తనకే కాకుండా తన కుటుంబానికి కూడా పేరు ప్రతిష్టలు తీసుకువస్తాడు. ఆచార్య చాణక్య మనిషి సంతోషకరమైన జీవితం కోసం ఏది త్యాగం చేయాలో తెలియజేశాడు. మనిషి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వారిని, లేదా వస్తువును కోల్పోవడం వల్ల అతనిలో దుఃఖం పుడుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దేనిపైన అయినా మోహం పెంచుకున్న వ్యక్తి అది దూరమైనప్పుడు దుఃఖానికి గురవుతాడు. అందుకే మనిషి విపరీత వ్యామోహాలను వదులుకోవాలి. అప్పుడే సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాడు. అనుబంధాల ఉచ్చులో చిక్కుకున్న వ్యక్తి తన లక్ష్యానికి దూరమవుతాడు.

Updated Date - 2023-01-18T12:35:12+05:30 IST