Dog World Record: అయిదో.. పదో కాదు.. కేవలం 27 గంటల్లోనే ఈ శునకం ఎన్ని పిల్లలకు జన్మనిచ్చిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-03-30T21:48:39+05:30 IST

ఒకేసారి 21 పిల్లల్ని పెట్టిన కుక్క.. ఉదంతం వైరల్..

Dog World Record: అయిదో.. పదో కాదు.. కేవలం 27 గంటల్లోనే ఈ శునకం ఎన్ని పిల్లలకు జన్మనిచ్చిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ఇంటర్నెట్ డెస్క్: కుక్కలు సాధారణంగా ఒకవిడతలో ఎన్ని పిల్లలకు జన్మనిస్తాయంటే ఐదు, ఆరు.. మహాయితే ఏ తొమ్మిదో అని చెబుతాం. కానీ.. ఓ కుక్క ఏకంగా 21 మంది పిల్లలకు జన్మనిచ్చిందంటే నమ్మశక్యం కాదు కదూ! కానీ..అమెరికాలో ఇటీవల ఓ కుక్క ఏకంగా 21 మంది కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. వర్జీనియా నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ కుక్క గ్రేట్ డేన్ జాతికి చెందినది. ఒకేసారి ఇన్ని కుక్క పిల్లలకు జన్మనిచ్చిన ఆ కుక్కను చూసి ఆశ్చర్యపోయానంటూ యజమాని టాన్యా డబ్స్ మీడియాకు చెప్పారు.

టాన్యా ప్రస్తుతం ఓ పెంపుడు జంతువుల సంరక్షణాలయ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఒకేసారి రికార్డు స్థాయిలో 21 పిల్లల్ని పెట్టిన ఈ కుక్క పేరు నేమీన్. ప్రస్తుతం నెమీన్ పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కుక్క నిజంగా ఓ సూపర్ మామ్ అని నెటిజన్లు తెగ పొడుగుతున్నారు. 27 గంటల్లో మొత్తం 21 పిల్లల్ని కని రికార్డు సృష్టించింది నెమీన్.

ఓ కుక్క ఇన్ని పిల్లల్ని కనడం తానెప్పుడూ చూడలేదని టాన్యా తెలిపింది. మొదట్లో ఆ కుక్క ఏడో ఎనిమిదో పిల్లల్ని పెడుతుందనుకున్నా.. కానీ..ఒకేసారి 16 కుక్క పిల్లల్ని కంది. విషయం అక్కడితో ఆగిపోతుందని అనుకున్నా. ఆ తరువాత కొద్ది గంటల వ్యవధిలో మరో ఐదు పిల్లల్ని పెట్టింది. అంటూ టాన్య తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వీటిలో 12 ఆడవి కాగా మిగతావి మొగ కుక్కలని టాన్యా పేర్కొంది. ఈ కుక్క పిల్లల్లో చాలామటుకు అమ్మేస్తానని, అలా వచ్చిన డబ్బును జంతు సంరక్షణాలయానికి ఇచ్చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రపంచంలోని భారీ కుక్కల్లో గ్రేట్ డేన్స్ కూడా ఒకటి. ఒక్కొక్కటి సుమారు 45 కేజీల బరువుతో పాటూ రెండున్నర మీటర్ల పొడవుంటాయి. వెనకు కాళ్లపై నిలుగ్గా నిలబడినప్పుడు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కనిపిస్తాయి.

Updated Date - 2023-03-30T21:48:48+05:30 IST