Golden Tomb: సమాధులను తవ్వుతోంటే బయటపడిన రెండు బంగారు నెక్లెస్‌లు.. రెట్టించిన ఉత్సాహంతో ఇంకా తవ్వితే..!

ABN , First Publish Date - 2023-03-30T17:37:16+05:30 IST

సమాధులు తవ్వుతుండగా వారికి రెండు బంగారు నెక్లెస్(Two gold necklaces) లు దొరికాయి. అవి చూడగానే వారి కళ్ళు జిగేలుమన్నాయి. మరింత ఉత్సాహంతో తవ్వగా..

Golden Tomb: సమాధులను తవ్వుతోంటే బయటపడిన రెండు బంగారు నెక్లెస్‌లు.. రెట్టించిన ఉత్సాహంతో ఇంకా తవ్వితే..!

రాజుల కాలంనాటి సమాధుల(graves)లోనూ, పాతకాలం గుడుల(old temples)లోనూ బంగారు నగలు, నాణేలు నిక్షిప్తం చేసి ఉంటారని మనం ఎప్పటినుండో వింటున్నాం. చాలా చోట్ల ఇలాంటి నిధులను ఆశించి అర్దరాత్రుల్లో గుడులు కూలగొట్టిన దొంగలు, సమాధులు తవ్విన వారి గురించి వార్తలు కూడా వింటూ ఉంటాం. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రలో ఏం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి శిధిలాలలో అన్వేషణ చేస్తుంటారు. ఆర్కియాలజిస్టులు(archaeologist) కూడా పురావస్తు ఆధారాల కోసం సమాధులు తవ్వుతుండగా వారికి రెండు బంగారు నెక్లెస్(Two gold necklaces) లు దొరికాయి. అవి చూడగానే వారి కళ్ళు జిగేలుమన్నాయి. మరింత ఉత్సాహంతో తవ్వగా దిమ్మతిరిగిపోయింది వారికి. ఏళ్ళ నాటి నిధి(Treasure) వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఆర్మేనియా(Armenia) మెర్సామోర్(Mersamor) లో పోలిష్-ఆర్మేనియా కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు(archaeologist) పాడుబడిన కొన్ని సమాధుల తవ్వకం చేపట్టారు. కొద్దిగా తవ్వగానే రెండు బంగారు నక్లెస్ లు బయటపడ్డాయి. అవి చూడగానే అక్కడ అందరి కళ్ళు జిగేలుమన్నాయి. వారు మరింత ఉత్సాహంతో ఆ సమాధులను లోతుగా తవ్వగా రెండు అస్థిపంజరా(Two Skeletons)లతో పాటు బంగారం, వెండి, ముత్యాలు(Gold, silver, pearls) దొరికాయి. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అవి 3200సంవత్సరాల కిందటి సమాధులని, ఈజిప్షియన్ పాలకుడు ది గ్రేట్ రామ్ సెస్(The Great Ramses) అప్పటి పాలకుడని తెలిపారు. ఆ సమాధులలో దొరికిన నగలు, ముత్యాలు, బంగారు లాకెట్లు కాంస్యయుగం(Bronze age) నాటివని చెప్పారు. ఈ శాస్త్రవేత్తలు 1965సంవత్సరం నుండి ఆ ప్రాంతాలలో ఆధారాల కోసం త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. వారి కష్టానికి ఫలితంగా నేడు సమాధులలో నిధులు, అస్థిపంజరాలు బయల్పడ్డాయి.

gold.gif

read also: Bride: వరుడి ప్రవర్తన చూసి వధువుకు అనుమానం.. లెక్కపెట్టమని రూ.10 నోట్లు ఇచ్చిన వధువు.. పెళ్ళిమంటపంలో సినిమా ట్విస్ట్..!


ఈ సమాధులలో లభ్యమైన అస్థిపంజరాలు ఒక పెట్టెలో లభ్యమయ్యాయి. రెండు అస్థిపంజరాలు భార్యాభర్తలవని వీరు గుర్తించారు. వీరి వయసు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. అస్థిపంజర ఎముకలు పరిశీలించగా అవి చాలా భద్రంగా ఉన్నాయని, కాళ్ళు కొద్దిగా వంగి ఉన్నాయని పేర్కొన్నారు. వీరు ఎలా మరణించారనే కారణం తెలియలేదు. ఇద్దరూ ఒకేసారి మరణించారని భావిస్తున్నారు.ఒకసారి సమాధి చేశాక మళ్ళీ వాటిని తెరవలేదని, ఈ కారణంగా వారు ఒకేసారి మరణించి ఉంటారని భావించారు. కాగా ఈ సమాధులు బయల్పడిన ప్రాంతం 200హెక్టార్లు విస్తరించి ఉంది. అందులో శ్మశానవాటిక ఉన్న ఆధారాలు దొరికాయి. చరిత్రకు సంబంధించి చాలా ఆధారాలు దొరకడంతో శాస్త్రవేత్తలు సంతోషంలో మునిగిపోయారు. వాటి ఆధారంగా మరింత లోతైన పరిశోధనలు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also: Viral News: కొడుకు ఏదో చేస్తున్నాడని డౌట్.. ఎవరికీ తెలియకుండా అతడి గదిలో సీసీ కెమెరాలను ఆ తండ్రి ఏర్పాటు చేయిస్తే..


Updated Date - 2023-03-30T17:38:38+05:30 IST