Samantha Ruth Prabhu: గ్లామర్ క్వీన్ శకుంతలగా ఎలా మారిందో చూసారా!

ABN , First Publish Date - 2023-01-30T17:15:43+05:30 IST

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసిటిస్ (myositis disease) అనే వ్యాధినుండి కోలుకొని తిరిగి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టింది. త్వరలో తన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. గ్లామర్ క్వీన్ గా పేరొందిన సమంత 'శాకుంతలం' అనే పౌరాణిక ప్రేమకథలో శకుంతల గా కనిపించబోతోంది.

Samantha Ruth Prabhu: గ్లామర్ క్వీన్ శకుంతలగా ఎలా మారిందో చూసారా!

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసిటిస్ (myositis disease) అనే వ్యాధినుండి కోలుకొని తిరిగి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టింది. త్వరలో తన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. గ్లామర్ క్వీన్ గా పేరొందిన సమంత 'శాకుంతలం' అనే పౌరాణిక ప్రేమకథలో శకుంతల గా కనిపించబోతోంది. ఈ సినిమా విడుదలకి సిద్ధంగా వుంది. ఈ కథ భారతంలోని (Maha Bharatham) ఆదిపర్వం లో ఉంటుంది. వ్యాస మహర్షి రాసిన భారతాన్ని నన్నయ గారు తెలుగులో రాసారు కాగా, అందులో ఈ 'దుష్యంతో పాఖ్యానం' కూడా చాలా బాగా రాసారు అని చెపుతూ వుంటారు. ఇది చాలా ముఖ్యమయిన ఘట్టం కూడా. ఎందుకంటే శకుంతలకి (Shakuntala) దుష్యంతుడు (Dushyanth) కి పుట్టిన భరతుడుతో (Bharath) భరతవంశం మొదలవుతుంది.

shakuntalam2.jpg

మహాకవి కాళిదాసు(Mahakavi Kalidasu) ఈ కథనే 'అభిజ్ఞాన శాకుంతలం' గా అద్భుతమయిన రచన చేశారు. అయితే అందులో అయన కొంచెం తన కవి హృదయాన్ని తీసుకొని తన ఆలోచనలని కూడా ఇందులో పేర్చి మరికొంత హృద్యంగా కథగా మలిచారు. కానీ కథకి మూలం మాత్రం భారతం మాత్రమే. అందులోదే అసలు సిసలయిన కథ.

శకుంతల జననం కూడా విచిత్రమయినదే. రాజర్షి అయిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి గొప్ప తపస్సును ప్రారంభించగా, దేవేంద్రుడు అతని తపస్సును భగ్నం చేయమని అప్సరస అయిన మేనకను పంపించాడు. మేనక భయపడుతూనే విశ్వామిత్రుని తపస్సును భగ్నం చెయ్యడానికి అక్కడే తిరుగుతూ అతని కనుసన్నలలో మెలుగుతూ ఉంటుంది. ఆలా ఒకనాడు మేనక విహరిస్తున్న సమయంలో విశ్వామిత్రుడు మేనకను చూసి ఆమె పొందు కోరుతాడు, మేనక కూడా అంగీకరిస్తుంది. అప్పుడు ఈ శకుంతల అనే కన్య పుట్టింది.

shakuntalam3.jpg

శకుంతల పుట్టగానే విశ్వామిత్రుడు అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు, మేనక కూడా అక్కడ వున్న ఇసుక తిన్నుల మీద ఈ పాపని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ వున్న పక్షులు ఈ చిన్ని పాపని రాక్షసుల, క్రూర మృగాల బారిన పడకుండా రక్షిస్తాయి. శకుంతలాలు రక్షించాయి కాబట్టి ఆమెకి శకుంతల అని పేరు పెట్టారు. ఆలా ఆమె కన్వ మహర్షికి దొరికి అతని ఆశ్రమం లో పెరుగుతుంది.

shakuntalam5.jpg

శకుంతల పెద్దది అయ్యాక దుష్యంత మహారాజు బలపరాక్రమాలు వింటూ ఉండేది. ఒకనాడు దుష్యంతుడు అడవికి వేటకి వచ్చి ఈ కణ్వ ముని ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అప్పుడు శకుంతలను చూస్తాడు, అతనికి శకుంతల ఎవరో తెలియదు, కానీ శకుంతలకి మాత్రం దుష్యంత మహారాజు తెలుసు, అతని గురించి ఎప్పుడూ వింటూ ఉండేది కాబట్టి. ఆలా వారిద్దరూ అక్కడే ప్రేమలో పడతారు. అయితే దుష్యంత మహారాజు ఆమె మునికన్య అని అనుకొని కొంచెం సందేహపడతాడు, కానీ అప్పుడే శకుంతల తాను రాజకన్యయే కానీ మునికన్య కాదు అని పై విధంగా తన జన్మ రహస్యాన్ని దుష్యంతుడుకి చెపుతుంది.

ఇక మిగతా కథ అందరికీ తెలిసిందే. దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకోవడం, రాజ్యానికి తిరిగి వెళ్ళాక అందరితో వచ్చి శకుంతలను తీసుకు వెళతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా దుష్యంతుడు రాడు, ఇక్కడ శకుంతల ఒక బిడ్డకు జన్మనిచ్చి అతనికి భరతుడు అని పేరు పెట్టి అతన్ని పెంచుతూ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తరువాత, కణ్వ మహర్షి శకుంతలను బిడ్డని తీసుకొని దుశ్యంతుడి రాజ్యానికి వెళ్ళమని చెప్పి పంపిస్తాడు. శకుంతల దుష్యంతుని రాజ్యానికి వచ్చి అతనితో చాల ధీరోదాత్తంగా మాట్లాడుతుంది. ఆమె ఎంత ఉన్నతురాలో, ఎలా మాట్లాడాలో, ఎంతటి బలమయిన యువతో, అన్నీ మించి ఎంతటి సాహసవంతురాలో కూడా అక్కడే తెలుస్తుంది. ఆ తరువాత వాళ్లిద్దరూ కలుసుకోవటం, దుష్యంతుడు తన తప్పు ఒప్పుకోవటం జరుగుతాయి. ఇదీ టూకీగా కథ.

shakuntalam4.jpg

సమంత శకుంతలాగా ఎలా చేసిందో, దేవ్ మోహన్ (Dev Mohan) దుష్యంతుడుగా ఎలా వున్నాడో మరి దర్శకుడు గుణశేఖర్ (Director Gunasekhar) ఎలా తెరకెక్కించారో అన్నది ఆసక్తికరం.

-- సురేష్ కవిరాయని

Updated Date - 2023-01-30T17:15:45+05:30 IST