Viral: వామ్మో.. ఈ యువతీయువకులు ఇలా రెచ్చిపోతారని ఎవ్వరూ ఊహించలేదు.. రోడ్డు మీద అందరూ చూస్తుండగా..
ABN , First Publish Date - 2023-09-17T22:35:23+05:30 IST
ఇద్దరు యువతీయువకులు ఒకరినొకరు చెంపలు వాయించుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రాంక్ వీడియో తీసే ప్రయత్నం బెడిసికొట్టడంతో ఈ ఘటన జరిగిందట.

ఇంటర్నెట్ డెస్క్: ఓ ప్రాంక్ వీడియో ఇద్దరు యువతీయువకుల మధ్య గొడవకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని(New Delhi) కాన్నాట్ ప్లేస్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రాంక్ వీడియో తీసే క్రమంలో వారి మధ్య అకస్మాత్తుగా గొడవ మొదలైంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన యువతి యువకుడి చెంప ఛెళ్లుమనిపించింది.
కానీ యువకుడు మాత్రం కాస్తంత సమ్యమనం పాటించాడు. ఆమెపై చేయిఎత్తక పోయినా తీవ్ర వాదులాటకు దిగాడు. క్షణక్షణానికీ వారి వాగ్యుద్ధం తీవ్రత పెరిగిపోయింది. ఈ క్రమంలో యువతి మరో రెండు సార్లు అతడి చెంప పగలగొట్టింది. యువతి మరీ ఈ రేంజ్‌లో రెచ్చి పోతుందని ఊహించని వారు సీన్ చూసి ఒక్కసారిగా భయపడిపోయారు.
యువతి మరీ ఇన్నిసార్లు తనపై చేయిచేసుకోవడంతో సమ్యమనం కోల్పోయిన యువకుడు వెంటనే ఆమెపై కూడా చేయిచేసుకున్నాడు.(Girl boy slap each other aggresively) దీంతో, ఒక్క నిమిషం బిత్తరపోయిన యువతి..ఉండు నీ సంగతి చెబుతానంటూ ఎవరికో ఫోన్ కలిపే ప్రయత్నం చేసింది. యువకుడు కూడా తగ్గేదే లేదంటూ అక్కడి నుంచి అంగుళం కూడా కదలలేదు. ఎవరిని పిలుస్తావో పిలు అంటూ సవాలు విసిరారు. ఈలోపు చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఇద్దరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. గొడవ పెద్దది కాకుండా చూశారు. ఈ వ్యవహారం నెట్టింట బాట పట్టడంతో(Viral Video) జనాలు నోరెళ్ల బెడుతున్నారు.