అక్కడివారిలో 46 శాతం మందికి దెయ్యాలు, 7 శాతం మందికి రక్తపిశాచులు కనిపించాయట... భయకంపితులను చేస్తున్న సర్వే!
ABN , First Publish Date - 2023-03-05T10:17:39+05:30 IST
టీవీ సీరియల్స్, సినిమాలలో దెయ్యం కథలను చూసేవుంటాం. చిన్నతనంలో అమ్మమ్మ మనకు దెయ్యాల కథలు చెప్పేవుంటుంది. ఇదంతా మన వినోదం కోసమే అనుకుంటాం. అయితే దెయ్యాలు కేవలం వినోదానికి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే కాదు.
టీవీ సీరియల్స్, సినిమాలలో దెయ్యం కథలను చూసేవుంటాం. చిన్నతనంలో అమ్మమ్మ మనకు దెయ్యాల కథలు చెప్పేవుంటుంది. ఇదంతా మన వినోదం కోసమే అనుకుంటాం. అయితే దెయ్యాలు కేవలం వినోదానికి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే కాదు. అది నమ్మకాలకు సంబంధించినది. దెయ్యాల గురించి 2019లో IPSOS పోల్ పేరుతో ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో జనాలను దెయ్యాలను నమ్ముతున్నారా అని అడిగారు. అమెరికాలో 46% మంది ప్రజలు దెయ్యాలను నమ్ముతామని తెలిపారు.
7 శాతం మంది తాము రక్తపిశాచులను నమ్ముతామని చెప్పారు. బీబీసీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం తైవాన్‌లో 90 శాతం మంది జనం తాము దెయ్యాలను చూశామని పేర్కొన్నారు. జపాన్, కొరియా, చైనా, వియత్నాంలోని ప్రజలు కూడా దెయ్యాలను చూశామని, భయంకర అనుభూతులను ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రపంచంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో ఘోస్ట్ క్లబ్‌లు ఏర్పడ్డాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీటిలో కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ తదితర విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. 1882లో దెయ్యాలు, ఆత్మల గురించి అధ్యయనం చేయడానికి సొసైటీ ఫర్ ఫిజికల్ రీసెర్చ్ అనేది అమెరికాలో ఏర్పాటయ్యింది.
ఈ సంస్థ అధ్యక్షురాలు ఎలియనోర్ సెడ్గ్విక్ అనే మహిళ. ఆమెను మహిళా ఘోస్ట్‌బస్టర్ అని పిలుస్తారు. మన దేశంలో దెయ్యాలను చూసినవారు అవి తెల్ల చీర కట్టుకున్నాయనో లేదా ఎర్ర చీర కట్టుకున్నాయనో చెబుతుంటారు. ఏదిఏమైనప్పటికీ దెయ్యాల సబ్జెక్ట్ అంతుచిక్కని రహస్యంగా మారిపోయిందనడంలో సందేహం లేదు.