నా కూతురిని చంపేశా.. భర్తను కూడా వేధించిందంటూ.. పోలీసులకు చెప్పాడో తండ్రి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-18T19:13:40+05:30 IST

కన్న కూతురిని పొట్టనపెట్టుకున్న తండ్రి.. ఎందుకంటే..

నా కూతురిని చంపేశా.. భర్తను కూడా వేధించిందంటూ.. పోలీసులకు చెప్పాడో తండ్రి.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ‘‘నా కూతురిని చంపేశా.. భర్తను కూడా వేధించింది..’’ ఇవీ ఓ తండ్రి అన్నమాటలు. చిన్నప్పటి నుంచీ ఎంతో ప్రేమగా పెంచిన కుమార్తెను అతడు కర్రతో కొట్టి చంపేశాడు. బెంగళూరులో(Bengaluru) ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీఈఎల్‌లో పనిచేసి రిటైరైన ఓ వ్యక్తి ఇటీవల తన కూతురిని దారుణంగా కొట్టి చంపేశాడు. తొలుత తనకేం తెలియదని బుకాయించిన అతడు ఆ తరువాత పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో చివరకు నిజం ఒప్పుకున్నాడు. అతడి కుమార్తె ఆశా ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది.

ఆశా 2019లో తన సహోద్యోగిని ప్రేమ వివాహం చేసుకుంది. కానీ.. రెండేళ్ల తరువాత వారు విడిపోయారు. ఆశా తన భర్తపై గృహింస కేసు కూడా పెట్టింది. అయితే.. ఆశా తరచూ తమతో గొడవపడుతుండేదని ఆమె తండ్రి పోలీసులకు తెలిపాడు. తమతో అమర్యాదగా ప్రవర్తించేదని చెప్పుకొచ్చాడు. బుధవారం రాత్రి ఆ కుటుంబం భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. ఓ రెండు గంటల తరువాత నిద్రలేచిన ఆశా తనకు ఆకలేస్తోందని చెప్పడంతో ఆమె త్లలి ఇంట్లోని రొట్టెలను ఆమెకిచ్చి మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. అయితే.. ఓ రాత్రి వేళ ఆశా తండ్రి నిద్రలేచారు. తన కూతురిని కర్రతో చావచితక కొట్టి చంపేశాడు(Father beats daughter to death). విషయం పోలీసులకు చేరడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తొలుత తనకేం తెలీదని ఆశా తండ్రి బుకాయించే ప్రయత్నం చేసినా అతడి ఆటలు సాగలేదు. పోలీసులు సేకరించిన సాక్ష్యాలన్ని అతడే నిందితుడని రుజువు చేయడంతో చివరకు నేరం ఒప్పుకోకతప్పలేదు. కూతురు తనను, తన భార్యను నిత్యం వేధిస్తుండటంతోనే ఆమెను అంతమొందించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. మాజీ భర్తను కూడా వేధింపుల పాలు చేసిందన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-03-18T19:13:40+05:30 IST