Viral Video: ఇంజనీర్లనే మించిపోయిన రైతు.. పెట్రోల్, డీజిల్ అక్కర్లేకుండానే ట్రాక్టర్‌ను నడిపించేస్తున్నాడుగా..!

ABN , First Publish Date - 2023-09-21T19:42:45+05:30 IST

సీఎన్‌జీ ఇంధనంతో నడిచే ట్రాక్టర్ తయారు చేసిన ఓ రైతు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. ఆ ట్రాక్టర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral Video: ఇంజనీర్లనే మించిపోయిన రైతు.. పెట్రోల్, డీజిల్ అక్కర్లేకుండానే ట్రాక్టర్‌ను నడిపించేస్తున్నాడుగా..!

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట్లో వైరల్ వీడియోలు(Viral Video)( అనేకం ఉంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం భారతీయుల టాలెంట్‌ను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంటాయి. తాజాగా ఓ రైతు ఇంజినీర్లనే మించిపోయాడు. పెట్రోల్, డీజిల్ అవసరం లేని ట్రాక్టర్‌ను తయారు చేశాడు. అవును.. ట్రాక్టర్ అంటేనే భారీ వాహనం. అత్యధిక మోతాదులో శక్తిని విడుదల చేసే పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు లేకుండా ట్రాక్టర్ నడవలేదు. కానీ, ఓ ట్రాక్టర్‌ను సీఎన్‌జీతో నడిచేలా డిజైన్ చేశాడో రైతు.


ఈ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చిన రైతు పేరు దేవేంద్ర పర్మార్. అతడు ఉండేది మధ్యప్రదేశ్‌లోని(Madhyapradesh) పత్లావాడీ జిల్లాలో! సాధారణ ట్రాక్టర్‌ను సీఎన్‌జీతో నడిచేలా అతడు చేసిన మార్పులు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందుకోసం అతడు ట్రాక్టర్‌కు ఇరువైపులా రెండు సీఎన్‌జీ ట్యాంకులను అమర్చాడు. వాటిలోని ఇంధనం ఇంజిన్‌కు చేరేలా కనెక్షన్ ఇచ్చాడు. అంతే..సింపుల్‌గా సీఎన్‌జీ ట్రాక్టర్ రెడీ అయిపోయింది(Farmer makes tractor that runs on CNG).


ఇండియన్ ఫార్మర్ పేరిట ఉన్న ఎక్స్ అకౌంట్‌లో దేవేంద్ర పార్మర్ ఆవిష్కరణ ఇటీవలే తొలిసారిగా నెటిజన్ల ముందుకొచ్చింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడమే. చాలా క్లిష్టమైన సీఎన్‌జీ సాంకేతికను అతడు ట్రాక్టర్‌కు ఎలా జోడించాడో అర్థంకాక అనేక మంది ఆశ్చర్యపోయారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయుల తెలివితేటలు అమోఘమంటూ అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ వినూత్న ఆవిష్కరణను మీరూ చూసేయండి!

Updated Date - 2023-09-21T19:47:16+05:30 IST